పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అది చెడుట నీవు చెడుటయె
కద యెవ్వరు నిన్నుఁ దేఱి కనుఁగొనకయె న
వ్వుదు రొక కాసు నొసంగరు
తుది నీ బ్రతు కేమి యగునొ తోఁచదు నాకున్‌.

26


ఆ.

అనుచు బోధ సేయునట్టి మాయలమల్లి
బేసబెల్లి వగలవేసవెల్లి
నులిపి తెగులుబొల్లి నుల్లసిల్లెడు తల్లిఁ
జూచి యా బొజుంగుఁజోటి పల్కె.

27


క.

అమ్మా నా మానస మిపు
డమ్మానిసిఱేనిమీఁద నంటి వదల దిం
కిమ్మాడ్కిఁ జెప్ప చేటికిఁ
బొమ్మా మరుచేతికీలుబొమ్మా సరగన్‌.

28


క.

ధన మేమి బ్రాఁతి నా కది
ఘనమే ఘనమేచకప్రకటకచ వాఁడే
పెనుమేటిపెనిమిటి గదా
విను మే నిక్కంబు విన్నవించెదఁ దల్లీ.

29


ఆ.

పెల్లు కల్ల లల్లి బొల్లిమాటలఁ జల్లి
మెల్లమెల్ల నిల్లు గుల్లసేయు
తల్లి గలుగు లంకె నుల్లోలమతిఁ జేరు
పల్లవులకు సౌఖ్య మిల్ల జగతి.

30


క.

రమ్మంచును నమ్మించును
బొమ్మంచుం గోక లాగు పోఁకల్‌ రూకల్‌
క్రొమ్మించు సొమ్ము లెమ్మిం
దెమ్మంచును లాగు లంజె తెగి విటవరులన్‌.

31


సీ.

లఘువర్ణ గురువర్ణ లక్షణం బరయక
            సరసపదార్థముల్‌ సంగ్రహించి
వృత్తభంగమునకు వెఱపింతయును లేక
            గణనిర్ణయనిరూఢి ఘనత గనక