318 నార్ల రచనలు 1. పాలస్తీనా
సంఘర్షణలు జరిగాయి. వీటిలో మొట్ట మొదటిది 1920 ఏప్రిల్ 4వ తేదీనీ, చిట్ట చివరిది
1936 ఏప్రిల్ 19వ తేదీనీ ప్రారంభమైనాయి. అన్నింటిలోనూ ఈ చిట్టచివరి సంఘర్షణే
అతిభీకరమైంది. ఇది ఇంకా సాగుతూనే ఉంది.
ఆరబ్బుల స్వాతంత్ర్యోద్యమజ్వాలల్ని రుధిరధారలతో చల్లార్చాలని ప్రస్తుతం పాలస్తీనాలో
బ్రిటిషువారు ఎంతటి రాక్షస కృత్యాలను చేస్తున్నారో చెప్పడానికి వీలులేదు. పంజాబ్లో
జనరల్ డయ్యర్ ప్రదర్శించిన అమానుషత్వంగానీ, ఐర్లండ్ లో బ్లాక్ అండ్ ట్యూస్ సైనిక దళం
ప్రదర్శించిన పశుత్వంగాని, ప్రస్తుతం పాలస్తీనాలో బ్రిటిష్వారు అమలు జరుపుతున్న దమననీతి
ముందు చాలా సౌమ్యంగా కనబడతాయనడం అతిశయోక్తికాదు - ముమ్మాటికి!
ఇటీవలనే జవహర్లాల్ నెహ్రూ పండితుడు పాలస్తీనాను గురించి ఒక వ్యాసాన్ని వ్రాస్తూ,
దానిలో బ్రిటిష్ వారు చేస్తున్న ఘోరకృత్యాల్ని తెలిపే ఒక లేఖను ఉదహరించాడు. ఈ లేఖను
పాలస్తీనాలో ఉన్న ఒక ఇంగ్లీషులాయర్ ఇంగ్లండులో ఉన్న తన స్నేహితునికి వ్రాశాడట.
ఉత్తరాన్ని వ్రాసిన వ్యక్తీ, దాన్ని అందుకున్న వ్యక్తి - ఇద్దరూ కూడా విద్యాధికులట;
విశ్వాసనీయులట. ఆ లేఖలోని కొన్ని భాగాలు ఇవి:
“ఇక్కడి ప్రభుత్వాధికారులు దమననీతినే పూర్తిగా అవలంబించడానికి నిశ్చయించుకున్నట్టున్నారు.
వారు చూపుతున్న పశుత్వాన్ని గురించి బ్రిటిష్ సివిలియన్ ఎవ్వడు కూడా అసహ్యభావంతో
కంపించకుండా మాటాడ్డంగాని, వ్రాయడంగాని కష్టం.
"మోఫత్ హత్యానంతరం వారు (సైనికులు) జెనిన్ అనే చిన్న పట్టణాన్ని డైనమెట్తో పేల్చివేశారు.
ఈ సందర్భంలో 150 ఇళ్ళు కూలిపోయినవని ప్రభుత్వ ప్రకటనలో ఉంది. ఈ అంచనాను
మించికూడా నష్టం జరిగి ఉండవచ్చు.
"పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కొందరిని కాల్చి చంపివేశారు. హత్యా నేరాన్ని
గురించి కూపీ తియ్యడానికి అవలంబించిన పద్ధతులలో కొన్ని వర్ణించనలవి కానట్టివి.
"ఈ ఘోరాల్ని చేసింది నేరస్థుల్ని శిక్షించడానికి కాదు; ప్రజల్ని హడలెత్తించడానికి మాత్రమే!
"కేవలం ఇళ్ళను నాశనం చెయ్యడమే కాకుండా ప్రజల ఆస్తిని కూడా అపహరించారు (రొక్కం,
నగలు మొదలైనవి). చివరికి న్యూయార్క్ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వారి ఇనప పెట్టిలోని
ద్రవ్యాన్ని కూడా సంగ్రహించారు. ఈ చర్యను అమెరికన్ కాన్సల్ (రాయబారి) తీవ్రంగా
గర్హించాడు.
"ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాల్నీ నీకు తెలియజెప్పడం దుస్సాధ్యం. విస్మయ విషాదాల్ని
కలిగించే సంఘటనలు ఎన్నో నాకు తెలుసు. మచ్చుకు ఒకదాన్ని మాత్రం చెబుతాను
విప్లవకారులు టెలిఫోన్ తీగల్ని తెగగొట్టి వేస్తున్నారు. వాటిని గవర్నమెంట్ నౌకర్లు ఎప్పటికప్పుడు
రీపెయిర్ చేస్తూ ఉండాలి. ఇలా చేసే వారిలో కొందరు ఆరబ్బులు. వారు తీగల్ని బాగు
చేస్తూ ఉండగా విప్లవకారులు చూడ్డం తటస్థిస్తే - స్వజాతీయులే అని దయతలచ కుండా -