పుట:పల్నాటి చరిత్ర.pdf/89

ఈ పుట ఆమోదించబడ్డది

26

పల్నాటి చరిత్ర

పెదగార్లపాడు:- దేవాలయముననున్న శశ 1695 (A.D. 1773) నాటి శాసనము, ఆ దేవాలయమును బాగుచేసినట్లున్నది.

పిడుగురాళ్ల:- రహదారి బంగళావద్దనున్న పాడుపడిన కృష్ణాలయములో నున్నది. ఆదేవాలయమును శక 1472 (1550 A. D.) లో బాగు చేయించినట్లు గల శాసనము.

శ్రీగిరిపాడు:- శక 1220 (1298 A D) నాటి శాసన మొకటి కలదు. చోళుల కాలమున కట్టబడినదని చెప్పబడు శివాలయము కలదు.

తంగెడః- పాడుపడిన కోటయు ఆకోటలో పాడుపడిన 16 దేవాలయములు కలవు. శక 1294 (A D. 1372) నాటిది కొండవీటినేలు ఆళియ వేమారేడ్డియొక్క శాసనము కలదు. శక 1474 ( 1552 A D.) నాటి దానశాసనము దుగ్గగుడికి పడమరగా కలదు. ఇది విజయనగర రాజులనాటి శాసనము. ఇందు రామరాజ, రామదేవ, తిరుమల దేవుల పేరులు కలవు. తంగెడ కోటను ఉప్పల (అనుముల) కోటిరెడ్డి యనునతకడు కట్టించినట్లు తెలియుచున్నది.

తేరాల:- సిద్ధేశ్వరస్వామి గుడిలో శక 1165 (A.D. 1243) నాటి దానశాసనము కలదు. ఇంకొకరాతిమీద శక 1366 (1444 A. D) నాటి దాన శాసనము కలదు.

పొందుగుల.. శక 1672 (1750 A.D) లో విపరీతమైన వరదలు కృష్ణానదిలో వచ్చినట్లు ఒకశాసన మున్నది.