పుట:పల్నాటి చరిత్ర.pdf/85

ఈ పుట ఆమోదించబడ్డది

22

పల్నాటి చరిత్ర

మునకు శాలివాహనశక 1051 సౌమ్య సం॥ (1129-30 A. D.) దానశాసనము వ్రాయించెను. ఈశాసనము వ్రాయబడిన నాగస్తంభముకూడ ఆకాలమునందే ప్రతిష్టింపబడినది. ఈశాసనములోని మొదటి రెండుశ్లోకములలో శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, అబ్జుడు, మహాంబుజుడు, శంఖధరుడు కుళితుడు యనెడు యష్టనాగముల ప్రార్థన కలదు,”

ఈ త్రిమూర్తి దేవాలయము కోటగడ్డలలోని శిధిల మయిన ముక్కంటి దేవాలయములోనిదై యుండును.

కోటసానిబావివద్ద చిన్న రాతిమీద పాళీభాషలోని శాసనము బౌద్ధయుగమునాటిది కలదు. చోళులకాలముప కట్టబడినదని చెప్పబడుచు కాలినగురజాల యిష్టకామేశ హరాయని శ్రీనాధునిచే చాటు పద్యము చెప్పబడిన యిష్టకామేశ్వరాలయము కలదు. గురజాలలో రహదారి బంగళాకు వెనుకవైపున పొలములో పాళీభాషలోగల శాసనము (రెండువేల సంవత్సరముల క్రిందటిది) ఉండెడిది. దానినిప్పుడు గురజాల తాలూకా ఆఫీసులో నుంచినారు.

పల్నాటివీరుల కోటయని చెప్పబడు ప్రదేశముకలదు. దీనినిప్పుడు కోటగడ్డలందురు. ఇది యప్పడు శ్మశానముగా వాడబడుచున్నది. “ముక్కంటి" గుడియని పిలువబడు పాడుపడిన శివాలయమిందు కలదు. ఇది కోట మధ్యనున్నది. కోట లోని వారిందు పూజ చేయుచుండువారట.

వీరభద్రాలయము (వీరేశ్వరాలయము) రాజరాజ