పుట:పల్నాటి చరిత్ర.pdf/84

ఈ పుట ఆమోదించబడ్డది
కారెంపూడి 12 కందుకూరివారు
తుమృకోడు 12 డిటో
గురిజాల 16 దుగ్గరాజువారు
తంగెడ 46 తుమ్మలచెర్వువారు

ఆంజనేయుని గుడిలో శక 1547 (A.D. 1625) నాటి శాసనముకలదు దానివద్దనే శక 1577 (1655 AD.) నాటి శాసనమింకొకటి కలదు ఇచ్చట పాళీభాషలోని శాసనములు కొన్ని కలవు. బౌద్ధులకాలమున నిక్కడ యొక స్తూపముండెడిది. నాగార్జునకొండ స్తూపముకంటే అది చిన్నది. దాని వ్యాసము అడుగులు ఎత్తు 8 అడుగులుండెను.

గుండ్లపాడు: శివవిష్ణు ఆలయములకు తూర్పున శక 1243 (1321 AD) నాటి దానశాసనముకలదు. 1175 లేక 1115 A D తేదిగలు శిధిలమగు శాసనము గ్రామమునకు పడమర కలదు.

గురజాల:- వీరభద్రస్వామి గుడిలోని నాగుపాములు బొమ్మలుగల శాసవముగూర్చి శ్రీచిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రలో నిట్లున్నది.

“బిరుదాంకరుద్రుడను నామాంతరముగల చాగి బేతరాజు పల్నాటికి ప్రభువై భూలోకమల్లునకు కప్పము కట్టుచుండెను. ఇతడు హైహయవంశజుడు. ఈరాజు కామనూరు వాస్తవ్యుడును ఋగ్వేదపాఠియునగు నొక బ్రాహ్మణునిచే మాధవీపురము (గురజాల)లో ప్రతిష్టించబడిన త్రిమూర్తి దేవాలయ