పుట:పల్నాటి చరిత్ర.pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

7

14. ఘటం కాంతయ్య:- దైదనివాసి. వైదికుడు. ఘటకాంతోపదేశములను వేదాంత గ్రంధమును కందార్థములుగా వ్రాసెను. రుక్మిణీపరిణయమను జంగముకధను వ్రాసెను.

15. కొండ భవానిశంకరాచార్యులు:- విశ్వబ్రాహ్మణుడు వేమవరనివాసి. కనకదుర్గశతకము శ్రీగిరీశ్వరశతకము వీరబ్రహ్మయోగి నాటకము (యక్షగానము) వ్రాసెను.

16. చిరుమామిళ్ల సుబ్బయ్యదాసు:- ధర్మవర నివాసి. కమ్మకులము, గోపాలశతకము, రమాధిపశతకము మున్నగునవి రచించెను.

17. గాదె లక్ష్మీపతి:- పేటసన్నిగండ్లనివాసి. బ్రాహ్మణుడు, నియోగి, భక్తచింతామణి శతకమును రచించెను.

18. బూరుగుపల్లి పురుషోత్తము:- వైదికుడు. రెంటాల నివాసి. తిరుమలేశ్వరశతకము వ్రాసెను.

19. వారణాసి లక్ష్మీనారాయణ:- పిల్లుట్ల నివాసి సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూలులో తెలుగు పండితులుగ నుండిరి మొదలగువారు.

పల్నాటిలోని ప్రస్తుత కవులు

1. కన్నెగంటి వీరభద్రాచారి:- తక్కెళ్లపాడు విశ్వబ్రాహ్మణుడు. అష్టావధాని నవభారతము, పేదరాలు, పార్వతీపరిణయము, నందికొండచిలుక, మున్నగునవి రచించెను.

2 కన్నెగంటి లింగాచారి:- తక్కెళ్లపాడు విశ్వబ్రాహ్మణుడు , నీలలోహితశతకమును రచించెను.