పుట:పల్నాటి చరిత్ర.pdf/65

ఈ పుట ఆమోదించబడ్డది

2

పల్నాటి చరిత్ర

పట్టభద్రులు పైడిపాటికివచ్చి
మేళ్లవాడుననిల్చె మించినదండు
కదనరంగంబున కార్యమపూడి
పుణ్యభూమినిజేరి పొందుగాదండు
అఖిలభూతములకు నాచారముగను
ఘనమైనపోతుల గావుచెల్లించి
[1]తరువాత సర్ఫాఖ్య తటినిలోపలను
పటుగంగధార నాబరగిన మడుగు
పొంతకుజని వీరపుంగవులెల్ల
నిలిపిరి లింగముల్ నేమంబు తోడ

§§§§ §§§§ §§§§ §§§§

[2] సహాయమునకై నలగామరాజు లేఖలుపంపిన కొందఱు రాజులు

మామగుండముకోట మనుజేశునకును
ధరణికోట పురికి దక్షుడైనట్టి
భీమదేవుండను పృథ్వీశునకును
ఉరగసేనుండను యుర్వీశునకున
పెదబాహుభూపతి భీమపేనులకు


  1. నాగులేరు.
  2. ఈరాజుల కాలమును విపులముగా చర్చించి
    అక్కిరాజు ఉమాకాంతముగారు పల్నాటి యుద్ధకాలమును
    నిర్ణయించిరి.