పుట:పల్నాటి చరిత్ర.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

29

సాధురేఫశకటరేఫ (ర, ఱ) లకు యతి ప్రాస మైత్రుల నప్పకవి యొప్పలేదు. అతనిపూర్వులలో నొకడు (క) అను అక్షరమునకు నూఱు అర్థములు చెప్పుటచే 'కాకునూరు' యని పౌరుషనామముగా యింటి పేర్లువచ్చెనట.

5. యధావాక్కుల నన్నమయ్య:- బ్రాహ్మణుడు. క్రీ.శ.1241 ప్రాంతమున సర్వేశ్వర శతకమును సత్రశాలవద్ద రచించెను.

అభిమాన కవులు

(పల్నాటినిగూర్చి వ్రాసిన యితర ప్రాంతపు కవులు)

1. శ్రీనాధుడు:- జగద్విదిత కవి. పాకనాటి నియోగి బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రుడు. ఇతడు 1384 A. D. ప్రాంతమున జన్మించి 1404 లో వైషధము 1424 లో భీమ ఖండము 1432 లో కాశీఖండము, తరువాత హరవిలాసము ముసలితనములో పల్నాటి వీర చరిత్ర రచించి యుండును. పల్నాటిలో చాలాసార్లు తిరిగి పద్యములు చెప్పుటయేగాక పల్నాటి వీరచరిత్రను ముంజరి ద్విపదగా రచించెరు, నారికురుపుచే బాధపడుచు శోకభారమున నీసుద్దులు చెప్పెనని కొంద రందురు. కొందరీక్రింది కథ కూడ చెప్పెదరు. “వయసునందు స్వేచ్ఛగదిరుగుటచే యొడలు చెడిపోయెను. పల్నాటిలో చెన్న కేశవుని దర్శింపగ వ్యాధి కొంతతగ్గెన.ు కలలో చెన్నకేశవుడు గాన్పించి వీరుల చరిత్రమును వ్రాసి తనకంకితము చేయుమని కోరెను. శ్రీనాధుడు వ్రాయుటకుబూని పూర్తిచేయు సరికి