పుట:పల్నాటి చరిత్ర.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

8

పల్నాటి చరిత్ర


పల్నాటిలోని తుమృుకోడువద్దను మల్లవరమువద్దను వజ్రపు గనులున్నట్లున్ను మొగలాయి రాజుల కాలమునం దాగనులలో పనిచేయుచుండినట్లున్ను గలదు. కోహినూరు వజ్రమునకు పల్నాటిలోని నదీతీర ప్రాంతమే జన్మస్థానమని యూహింపబడు చున్నది. చెన్నపట్టణమునుండి హైదరాబాదుకు పోపురోడ్డు పల్నాటిలోనుండిపోవును. అది తూర్పుయిండియా సంఘము వారిచే నిర్మింపబడినది, చెన్నపురినుండి హైదరాబాదుకు సైన్యములామార్గమునబోవుచుండెనట. దానిని దండుబాటయని పిలుతురు.

మేళ్లవాగువద్ద నాగులేటికి యానకట్ట కట్టి నీరు నిలువ చేసికొంతభూమిని మాగానిచేయుటకు వీలుకలదు. దాచేపల్లి వద్ద రాళ్లు భూమినుండి పైకి లేచి ఒకేమాదిరిగా వంగియుండును. అవిచూచుటకు చిత్రముగానుండును. గురజాలలో (పూర్వము గ్రామముండినచోట నొక సంవత్సరము క్రిందట కొన్ని రాగినాణెములు దొరికినవి. అవి అనేక వందల సంవత్స రములక్రిందటి నాణెములు. 1953 లోసెకండరీగ్రేడు ట్రయినింగు స్కూలువార్షికోత్సవసందర్భమునన (Exhibitionగా) ప్రదర్శింపబడినవి.

_____________