పుట:పల్నాటి చరిత్ర.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

4

పల్నాటి చరిత్ర


వీర చరిత్రలో చెప్పుటచే నాగుపామును పట్టి నాగులేరను పేరు వచ్చియుండును.

‘చంద్రవంక:- ఇది 'చంద్రభాగా' యని మాచర్లలోని యాదిత్యేశ్వరాలయ శాసనములో బేర్కొనబడినది. మాచర్ల వీరభద్రస్వామి యాలయములోని యెఱ్ఱబండ శాసనము సందును ‘చంద్రభాగ’ యనికలదు. హిమాలయమునుండి ప్రవహించునదులలో నొకదానికి చంద్రభాగయని పైశాసనములబట్టి చంద్రవంక కుకూడ చంద్రభాగయని పేరున్నట్లు తెలియుచున్నది. మాచర్ల వద్ద బాలచంద్రునివలె వంకరగా తిరుగుటచే చంద్రవంకయను పేరుగల్గెను.

గురజాల:- గురజాలకు గురివిందలయని మానవీపు రము అని ముదిగొండ వీరభద్రకవికృత వీరభాగవతమందు కలదు, మాధవియనగా గురివింద. గురివిందతీగలను నఱికి యూరుకట్టటచే గురిజాలయని వచ్చెనందురు. వీరచరిత్ర లోను గురిజాల, గుర్జాలయని శ్రీనాధుడు వ్రాసేను. చాటు పద్యములలో గురజాల యిష్టకామేశహరాయనియు గురిజాలసీమ యనియు వ్రాసెను. వీరభద్రస్వామి యాలయము లోని శక 1470 శాసనములో గురిందల గురిందలసీమయని కలదు.

మాచర్ల:- ఆదిత్యేశ్వరాలయ శాసనములో మహాదేవి తటాకమని మాచర్లకు వాడబడినది మాచర్ల వద్దనున్న మహదేవి చెరువునుబట్టి యీ పేరు వచ్చియుండును. వీరభద్రా