పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/99

ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

67


ఆ.

భక్తితోడఁ జేయు పరమపుణ్యాత్ముండు
యమునిసీమఁ ద్రొక్కఁ డది నిజంబు
గాన విష్ణుభక్తి గలిగియుండుట లెస్స
భవపయోధి [1]కదియ బాడబాగ్ని.

113


వ.

మఱియు ముద్రాన్యాసచ్ఛందోదేవర్షిసమాధియుక్తంబుగా
నష్టాక్షరి యొండె షడక్షరి యొండె ద్వాదశాక్షరి యొండె జపి
యించువారలు శంఖచక్రవనమాలాలంకృతులై విష్ణులోకంబున
విహరింతురు.

114


క.

ధర సాలగ్రామ [2]శ్రీ
హరిపూజలు సేయు నతనిఁ బ్రాపించును నా
పరిపూర్ణరాజసూయా
ధ్వరహయమేధముల ఫలము తద్దయు గణఁకన్.

115


సీ.

అవనిఁ గాష్ఠంబుల ననల ముండిన మాడ్కిఁ
        జెలఁగి సాలగ్రామశిలలయందు
విష్ణుతేజం బెప్డు విహరించు నటుగాన
        సకలలోకంబులు సకలదేవ
గణము నచ్చట వచ్చి కాపుండు నెప్పుడుఁ
        దత్పూజనము సేయు ధన్యమతుల
కధ్యాత్మవిదులకు నందని లోకంబు
        లొదవుఁ దత్సన్నిధినుండి పైతృ


తే.

కంబుఁ జేసినఁ దత్పితృగణము దివ్య
లోకములు గాంచుఁ దచ్ఛిలాలోకనమునఁ
దత్ప్రసాదంబు సేవయుఁ దనరెనేని
[3]పాపికైనను బ్రాపించుఁ బరమపదము.

116
  1. కిదియె (ము)
  2. హరిం, బరిపూజితుజేయు నతడు ప్రాపించునునా (హై-తి)
  3. పాపినై నను (ము)