పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/201

ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

169


క.

తనప్రాణ మిచ్చియైనను
ఘను లెల్లప్పుడుఁ బరోపకారము సేయన్
జనుఁ బరపురుషార్థముతో
నెనయవు పదివేలక్రతువు లెవ్వియు నైనన్.

143


వ.

అని నిశ్చయించి తనచేతి గంగాయమునాసంగమజలంబు
లతనికిం బోయుటయుఁ దజ్జలపానంబునం జేసి తృష్ణ దీర్చు
కొని యన్నీరంబు[1]శరీరంబునం జల్లుకొని యతండు తత్క్షణంబ.

144


ఉ.

ప్రీతిఁ బిశాచ [2]రూప మఱి పెంపెసలార సురల్ నుతింపఁగా
నాతతపద్మపత్రరుచిరాయతనేత్రయుగంబుఁ దప్తహే
మాతిమనోహరాంగకము నాయతబాహులు నీలకేశసం
ఘాతముఁ జారుభూషణసుగంధిదుకూలములున్ వెలుంగఁగన్.

145


వ.

ఇట్లు కేరళవిప్రుండు దివ్యరూపధరుండై పథికున కిట్లనియె.

146


క.

గంగాజలము మహత్త్వము
భంగి ప్రశంసింపలేఁడు బ్రహ్మయు నని తా
నంగీకరించి యౌదల
నంగజహరుఁ డునుచుకొనఁడె యఖిలము నెఱుఁగన్.

147


క.

తిలమాత్రమైన గంగా
జలపానము సేయునేని జనుఁ డప్పుడ యు
జ్జ్వలదివ్యదేహుఁడగు మఱిఁ
గలనైనను జొరఁడు తల్లి గర్భము నెపుడున్.

148


తే.

జ్ఞాతిబంధులలో నొక్కజనుఁడు ప్రీతి
నిం బ్రయాగకుఁ జని తర్పణంబు సేయ
నతనిగోత్రంబువారు పాపాత్ములైన
నరక మొందక పోదురు నాకమునకు.

149
  1. శిరంబునం జిలికించుకొని (తి-హై)
  2. రూపుడిగి (తి-హై)