పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

168

పద్మపురాణము


భృగుకచ్ఛ మనుచోటఁ బ్రీతి మత్పితరులు
        వసియించియున్నారు వారికొఱకు
జలము సితాసితసంగమంబున నుండి
        కొనిపోవుచున్నాఁడఁ గోర్కితోడ


తే.

నట్టి పుణ్యాంబువులు నన్ను నడిగె నితఁడు
పోయ ననరాదు వీనికిఁ బోయరాదు
గాన సందియమయ్యె నిక్కార్య మింక
నేమి సేయుదు [1]ననుచును నిచ్చఁ దలఁచి.

138


తే.

అశ్వమేధాదిఫలముల కధికఫలము
ప్రాణిరక్షణ మని ధాత్రిఁ బ్రకటలీల
నాగమోక్తులఁ జెప్పుదు రాదిమునులు
సకలధర్మోత్తరంబని చాటి చాటి.

139


ఉ.

ఈ వరతీర్థపూతజల మిప్పుడు ద్రావగఁ బోసి యీతనిన్
బావనుఁ జేసి యిట్టిగతిఁ బాపెదఁ గ్రమ్మఱ గంగ కేగి పు
ణ్యావృతమైన వారిఁ బ్రియమారఁగఁ దండ్రికిఁ దెచ్చియిచ్చెదన్
భూవలయంబులో నిదియపో పరమంబగు ధర్మ మారయన్.

140


క.

వర పురుషార్థముకంటెను
ధరలోఁ దలపోయ వేఱె ధర్మము గలదే
పరపురుషార్థము దొరకినఁ
గర మరుదుగఁ బ్రాణమిచ్చి కాచుట యరుదే.

141


తే.

ఉదక మిచ్చిన నిప్పిశాచోపకార
మొదవుచున్నది గావున నుర్వి నాకు
నింతకంటెను మఱి పుణ్యమెద్ది[2]మున్ను
[3]గలదు గాదె దధీచి వాక్యముల సరణి.

142
  1. నని నిశ్చయించె నతడు (హై), నని నిశ్చయించి తలచి (తి)
  2. యైన (హై), గలదు (మ)
  3. గలదె యెన్న దధీచి (హై)