పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

133


తే.

[1]దురగములు నెల్లప్రొద్దును గరము [2]మిగులు
నశ్వమేధాదికృత్యంబు లాచరించి
సర్వగానంబులును జేయు సత్ఫలంబు
లపుడె సిద్ధించు నరులకు ననఘచరిత!

211


వ.

అని చెప్పి రోమశమహాముని యివ్విషయంబున నొక్కయితి
హాసంబు గల దాకర్ణింపుమని వేదనిధి కిట్లనియె.

212

వీరసేన భద్రకుల చరిత్రము :

సీ.

వసుమతిలోన నవంతీశ్వరుఁడు వీర
        సేనాఖ్యుఁడను రాజశేఖరుండు
గలఁ డట్టి రాజు నిష్కల్మషుఁడై భక్తి
        నర్మదాతటమునఁ బేర్మితోడ
సౌవర్ణమయయాగశాలలు గావించి
        భర్మనిర్మాణయూపములు నిలిపి
రాజసూయముఁ జేసి యోజతోఁ బదియాఱు
        హయమేధములఁ జేసి యశ్రమమునఁ


ఆ.

బర్వతోపమానబహుధాన్యరాసుల
ధేనువులను కనకదానములను
వెలయ వేలసంఖ్య విప్రోత్తముల కిచ్చె
సకలజనులుఁ దన్ను సంస్తుతింప.

213


ఆ.

దానపరుఁడు దేవతాభక్తుఁ డుత్తముఁ
డధికసదయహృదయుఁ డనఘమూర్తి
వర్ణధర్మనీతివర్తనల్ పెంపొంద
నవని యేలుచుండు నతిముదమున.

214
  1. తురగముల (ము)
  2. మిగుల (ము)