పుట:పండితారాధ్యచరిత్ర.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

2

పండితసోదరులు ఈ గ్రంథములో ప్రత్యక్షముగా గ్రహింపగల రని మా దృఢవిశ్వాసము.

అడిగినదే తడవుగా మా ప్రార్థనమును మన్నించి, అనేక ప్రయాసల కోర్చి, సొంతపనులను కూడ మానుకొని ఈ గ్రంథమును శుద్ధముగా సంస్కరించి, పరినిష్ఠత మైన పీఠికను రచించి మా యుద్యమమునకు సర్వవిధములుగా సహాయపడిన డా. చిలుకూరు నారాయణరావు యం. ఏ., పి. హెచ్. డి. గారికీ ఈ సందర్భములో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతావందనములను సమర్పించుచున్నాము.

ఈ గ్రంథ ప్రాశస్త్యమును గురించియు, దీని విశిష్టగుణములను గురించియు మేము ప్రత్యేకముగా పేర్కోవలసిన అవసరము కానరాదు. శ్రీ నారాయణరావుగారే ఆవిషయముల నన్నిటిని సమగ్రముగాను, విపులముగాను తమ పీఠికలో ప్రశంసించియున్నారు.

ఆంధ్ర మహాజనులు మా గ్రంథమాలయందు యథాపూర్వమైన ఆదరాభిమానముల నుంచి, 30వ కుసుమముగా ప్రకటితమైన ఈ అపూర్వగ్రంథరాజమునకుకూడ యథోచితముగా ప్రోత్సాహ మిచ్చినయెడల మా యుద్యమము చరితార్థము కాగల దని విన్నవించుచున్నాము.

చెన్నపురి
ప్రకాశకులు.
4-12-39.