పుట:పండితారాధ్యచరిత్ర.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశకుల విజ్ఞప్తి


దాదాపు నాలుగైదేండ్ల పరిశ్రమ ఫలమును నేటికి బయట పెట్టగలుగుచున్నాము. ఈ ఆలస్యమునకు కారణమును సహృదయులైన పండితమహాశయులు ఊహించలేకపోరు.

ఆనాడు మేము దీనిప్రకటనకు ప్రారంభించినప్పుడు మా కాధారభూతమైనది దీని ప్రాత ముద్రితప్రతి ఒకటిమాత్రమే. అగుట కేమో ఇది అదివరకే ముద్రితమైయుండెను. కాని అది అడుగడుగునకును సంస్కారాపేక్షముగానే యుండెను. ఇటువంటి ఉత్తమగ్రంథము అటువంటి అసంస్కృతరూపములో ఉండుటను చూచి సహింపలేకయే మేము దీని పునర్ముద్రణమునకు పూనుకొంటిమి. అందుచేత ఆ లభించిన ఒక గుజిలీప్రతిని ఆధారముగా పెట్టుకొని, వివిధ భాండాగారములందు లభించిన భిన్నభిన్నము లయిన వ్రాతప్రతులతో దీనిని సరిచూచి, అనేక పాఠాంతరములను సేకరించి, యుక్తము లయిన పాఠమును గ్రహించి, అసలు గ్రంథమునకు దీటురాగల అమూల్యమైన పీఠికతో ఈ గ్రంథమును ఆంధ్రలోకమునకు సమర్పించవలయునని పూనుకొన్న మహోద్యమములో అనివార్యముగా ఈ ఆలస్యము సంభవించక తప్పినది కాదు. మా పరిశ్రమఫలితమును