పుట:పండితారాధ్యచరిత్ర.pdf/380

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీక్షాప్రకరణము

7

మహిమలు వర్ణింప మనుజుల తరమె?
కడు నర్థి నుత్పత్తికర్త నాబ్రహ్మ
వడి బ్రహ్మ మను బ్రహ్మవాదులఁ ద్రుంచి
హరభక్తి యుత్పత్తి కధిపతి నాఁగఁ
బరఁగెఁ దాఁ దొల్లి శ్రీపతి పండితయ్య;
స్థితికర్త హరి నుమాపతికి మ్రొక్కించి
క్షితి విష్ణువాదులఁ గీ టడఁగించి,
చెనసి భక్తిక్రియాస్థితికర్త యనఁగ
జనియెను లెంక మంచన పండితయ్య;
[1]గాథగా సంహారకర్తయ యనుచు
సాధారణముగ నీశ్వరుఁ బల్కుభక్తి
దూరాన్యసమయసంహారుఁడై చనియె
శూరుడు మల్లికార్జునపండితయ్య;
ఖ్యాపితభక్తికిఁ గారణపురుషు
లై పండితత్రయం బన భువిఁ జనియెఁ;
దనరు నీపండితత్రయములో మాన్యుఁ
డన నొప్పు మల్లికార్జున పండితయ్య;
అట్టి పండితమల్లికార్జును[2]మహిమ

  1. గాథమై(యై, య). సం.—"సంహారకర్తైన మహాదేవ ఇత్య సమంజసం వచశ్శాస్త్రపరిజ్ఞాన మవిజ్ఞాయ వదంతి యే”.
  2. చరిత