పుట:పండితారాధ్యచరిత్ర.pdf/378

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీక్షాప్రకరణము

5

దండతండములు పాతకములు వొలియుఁ;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
బండినసద్భక్తిభాగ్యంబు వొందుఁ;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
మండెడుదావాగ్ని మంచయిపోవు;
బండితారాధ్యులఁ బ్రస్తుతించిననుఁ
జండోరగాదివిషంబులు గ్రాఁగు;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
[1]దుండగంబులు [2]బహుదుఃఖముల్ వాయుఁ;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
దండి భవాంబుధి దరతర మింకుఁ;
బండితారాధ్యుల బ్రస్తుతించినను
ఖండితైశ్వర్యప్రకాశ[3]త దనరు;
భావింప నటు గాన పండితారాధ్య
దేవునిచరితఁ గీర్తింతు నెట్లనినఁ;

గురుస్తోత్రము


జిరతమోగుణ పరిస్ఫీతుండు శివుఁడు
[4]వరసత్త్వగుణ వికస్వరుఁడు పండితుఁడు;

  1. "దుర్దమా విషయక్లేశా శ్శాంతి మాయాంతి సత్వరం” అని సం.
  2. విష
  3. మిం పొందు
  4. పరతత్త్వ