పుట:పండితారాధ్యచరిత్ర.pdf/377

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

పండితారాధ్యచరిత్ర

శివభక్తసింహంబు చిన్నివాసంబు
భవగిరికులిశంబు బసవలింగంబుఁ
దెల్లంబుగా నస్మదియేశుఁ జెన్న
మల్లికార్జునదేవు మహితరూపంబుఁ
దానైన బసవన దండనాయకుని
జానొంద మత్కృతిస్స్వామిఁ గావించి;

భక్తప్రార్థన


[1]కమనీయ సకల నిష్కలతత్త్వ[2]మయులఁ
భ్రమథుల త్రిభువనప్రమథులఁ దలఁచి;
నుత పురాతనభక్త నూతనభక్త
వితతి లింగంబకా వీక్షించి [3]కొలిచి;
యారూఢముగ మల్లికార్జునపండి
తారాధ్యులచరిత్ర మర్థివర్ణింతుఁ.

కృతిఫలము


[4]బండితారాధ్యుల బ్రస్తుతించినను
నిండారు శివభక్తినియతి వర్ధిల్లుఁ;
బండితారాధ్యుల బ్రస్తుతించినను

  1. కమనియ్య శాసనము లందున్ను, తాటాకుపుస్తకములందున్ను ‘—అనియ్య’
    రూపము ప్రకటముగా ఉన్నది.
  2. విదుల
  3. తలఁచి
  4. కొన్నిపుస్తకములలో వాక్యావసానమందు అరసున్న, ఆదేశము కానరావు.