పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

12

ర్జునలింగ
మూర్తి యొప్పారు సమున్నతమహిమ
అట్టి శ్రీమన్మల్లికార్జునభక్తి
పట్టబద్ధ్రులును శ్రీపర్వతక్షేత్ర
వాసులు యామ్యకైలాసచూడావి
భాసితా నర్ఘ్యవిభ్రాజితమణులు
పరభుక్తి చిరముక్తి కరభక్తివతులు
నవచర్మధరకర్మ హరధర్మపరులు
కృతకృత్యహితభృత్య ధృతసత్యరతులు
వ్రతధామభృతశీమ జితకామమతులు
చిరకాపవరతాప ఖరపాపహరులు
హరతంత్రగురుమంత్ర పరతంత్రచరులు
ధన్యులుసుకృత వదాన్యులు విగత
దైన్యులు లోకైక మాన్యులు పరమ
పాత్రులు ప్రసాదైకగాత్రులు కర్మ
జైత్రులు భవలతాదాత్రులు త్రిమల
దూరులుశుభతరాకారులు గతవి
కారులు విగతసంసారులు దయావి
నిద్రులు కలియుగరుద్రులు వీర
భద్రులు కరుణా సముద్రులు బుధమ
నోజ్ఞులు దూరీకృతాజ్ఞులు శ్రుతవి
ధిజ్ఞులు వినుత దైవజ్ఞులహర్య
వీర్యులు శివపదాచార్యులు ప్రణమి
తార్యులు త్రిభువనవర్యు లనంగ
పూజ్యితశ్రుతిబరిస్ఫుట వీరభక్తి
రాజ్యైకమహిమాభిరతి సుఖించుచును
మానితాసంఖ్యాత మాహేశ్వరులు శి
వానందలీలమై యందోక్కనాడు
అరుదగు శ్రీమల్లికార్జునదేవు
నురుమంటపస్థలి నొండోలగమున
శివభక్తితత్వగోష్ఠి ప్రసంగమున
తవిలినూతన పురాతనభక్తమహిమ
లంకింపుచును నిజాపాంగహర్షాశ్రు
కంకణంబులురాల కరుణనంజూచి
యాలోనమృదుమధురాంచితాలాప
జాలంబు కర్ణరసాయనంబుగను
వీరమాహేశ్వరాచారవర్తనుల
వారిదృష్టాదృష్టవైభవోన్నతులు
డండితాఘులుఘనదండనాయకులు
పండితసత్తముల్ పండితాదులును
విస్తరించిరి తొల్లి విఖ్యాతిగా బ్ర
శస్తసద్భక్త ప్రసాదాతిశయత
ఖ్యాతిగా సద్భక్త గణలాలసముగ
నూతనంబుగ జగన్నుతముగా మున్ను
బసవపురాణ మొప్పగ రచించితివి
బసవపురాణ ప్రబంధంబునందు
ప్రథిత పురాతన భక్త గణాను
కథనంబుదితహాస ఘటనగూర్చితివి
వరవీరభక్తి సవైరికంబుగను
విరచించితివి చతుర్వేదసారమున
బసవన్నమహిమ శుంభద్భక్తియుక్తి
బసవించితివి గద్యపద్యాదికృతుల
అర్ణ్నవావృతధాత్రి నట్లొప్పు బసవ
వర్ణ్నన చేసిన వరుసనవీను
లారంగ గురుమల్లికార్జునపండి
తారాధ్యచరితంబు నట్లువర్నింపు
పరిశిష్ట పరిమిత ప్రాక్తనభక్త
చరితంబు లితి