పుట:నీతి రత్నాకరము.pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

96 నీతిరత్నాకరము జాలంధర నగరమునుండి పెండ్లి కరుదెంచువారి కాయాయితావుల శీతలవితానముల నమరింప శ్రీనివాసదా నూహించి యట్లే యొనరించెను. ఆ పందిరులయందుఁ 'బానకము ఫలాహారములు శిశువుల కావుపాలు నొసంగునట్టియేర్పాటు చక్కగా నొనరించెను. యోజనమున కొక్క తావున సత్రములఁ బెట్టించెను. ఆయాయిజాతులకు వేఱువేఱు భోజనముల నమరించి తదధికారులు సిద్ధముగ నుండిరి. భోజనమునకు, సుపహారము నకుఁ గొదువరానీయరాదని దా సిట్టి ప్రయత్నముల నొనరించె నని యెల్లరు సంతసిల్లుచుండిరి. దూరమునుండి పండితులు రాఁ బ్రయత్నించుచుండిరి. కవులు గాయకులు పరిహాసకులు నర్తకులు సంఖ్య కుమిగిలి రాసాగిరి. నాలుగుదినములకు ముందే వచ్చిన వారి కెల్ల భోజనమునకుఁ గొదువ లేనియట్లు చాటింపఁబడియెను. వేలకు వేలుగా వచ్చిన వారినందఱ నొక చోటఁ దోలి యెట్లో యన్నము పెట్టిన శ్రమమెక్కుడగుటయే కాక వారలకుఁ దృప్తియుఁ గలుగదని యూహించి యైదువం దల కొక్కొక్క తావున భోజనమిడునట్టిపద్దతి నొనరించెను, దానుదారహృదయుఁడనియుఁ బరమా స్తికుఁడనియు నెల్లరు కనుఁగొనిరి. అంతియ కాక స్వహస్తపాకులకు నర్హ భవనములు నిర్ణయింపఁబడియెను. ఒక్కొక్క విషయమునకుఁ గొందఱు నుద్యోగుల నిర్ణయించి యించుకంతయు లోప మావిషయమున రానీయకుండఁ జేయవలయునని వారల హెచ్చరించెను.

తనసౌధమునకుముందు విశాలభాగము నావరించునట్టు లొకపందిరి వేయించెను. ఆయుతసంఖ్యాకు లందుఁ గూరు చుండ నర్హముగనుండ బీఠము లమర్పఁబడియెను. చుట్టును