పుట:నీతి రత్నాకరము.pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆఱవ వీచిక. త్సాంక దాసుంగాంచి యేకాంతమున నెందో ఫూసగ్రుచ్చిన చందమున నావార్తల నన్నింటి నెఱిఁగించి ఘోర ప్రమాణముల నొనరించి వారి మనస్సంశయమును దుడిచి వేసెను. ఆమఱు దినమే రామదాసుగారితో నాలో చించి సుముహూర్తము నిశ్చయించిరి.

ఆమఱుదినమే పురోహితుని బంపిరి. ఆతఁడరిగి శ్రీనివాస దాసునకు జాలంధరనగర వార్తల నెఱింగించి యామువ్వుర చింతలం దొలఁగించెను. దాసాభూసురుని సంతుష్టుం జేసి శుభ ముహూర్తమును దెలిపిన నేను బురోహితుని బంపుదుననియు "రామదాసుగారు నిర్ణయీంచినదే ముహూర్తమనియుఁ దెల్పెను. ఆవార్తం గైకొని మరలి జాలంధర నగరమును జేరి గృహస్థ వర్యున కాసువార్తం దేలియఁజేసెను రామదాసు ముహూ ర్తము నిర్ణయించి శుభ దినమున విలాస ధామమునకుం బంపెను, శుభముహూర్తపుత్రికను జూచి యాదంపతులు మా నందమునొంది. విశేషించి వివాహ ప్రయత్నముల నొనరింప సాగిరి. నగరమంతయు నావివాహమహోత్సవమును గాంచఁ గోరుచున్న యట్టు లలంకరింపఁబడియెను. శక్తిక నురూపముగ నెల్ల వారును దమతమ గృహములకు ముందు రంభా స్తంభాదుల నిలుపుకొన ననువగునట్లు పందిరుల వేసికొనసాగిరి. అందందుఁ బాంథులకు ఫలాహారము లమరింపఁబడుచుండెను. ఏవిషయ మునను గ్రోత్త వారి కామహోత్సవసమయమునఁ గొదువ రాక యుండునట్టు లుచితరీతి సాయపడ నెల్ల రుత్సుకు లై యుండిరి.