పుట:నీతి రత్నాకరము.pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

నీతిరత్నాకరము మేలంతయు నీయదియేకదా యని యెంతయుం బ్రోత్సహించెను. శశిభూషణుఁడు విశ్వాసపాత్రుఁడు. సత్యహితుఁడు. పరోపకార నిపుణుఁడు. కావున శ్రీవత్సాంక దాసుని మనస్సంశయమును దొలఁగింప నెంచి సన్న్యాసి వేషమూని విలాస థామమున కరిగెను. నాలుగైదుదినములు పల్లియలలో సంచరించుచు నందందుఁ గారణాంతరములచే వారివార్తలరయుచు నిష్కళంక యశస్సును విని యానందించుచు విలాస థామమును జేరి సత్రములలో భుజించుచు వేషాంతరములఁ బూని సంతర్పణములలో దిరిగి భుజించుచు వార్తలురయుచుఁ బాతాళుని వ్యవహారమడిగి యా నెపమున రాధికా ప్రవృత్తిని బ్రశ్నించుచు దూషించునట్లు నటించి పాతాళుని పక్షమూని ప్రశ్నించుచు నెందఱినో యట్లు మాటలాడించుచు నొకపక్ష, మందుఁ గడపి శ్రీనివాసదాసు నింటికిం బోయి సన్న్యాసి గావున సులువుగ నాయింటం జోచ్చి సకల మర్యాదలొనరించి వా రెల్ల గారవింప నందే నాల్గు దినము లుండి సకలవిషయములఁ బరీక్షించి వారియనుమతి నోంది వారాణసికరుగుమార్గమునం బోయి మరలి జాలంధర పురమున కుం బోయెను

ఈనడుమ మాసము గడచెను. శ్రీనివాసదాసునకు నిందిరాదేవికి నీయభియోగ మూలమున ననుమానము తోచు నేమో యనుశంక శ్రీవత్సాంక దాసున కుదయించెను. వివాహ ప్రయత్నములు సాగించుట విరమించి యనవరత మాలోచింపసాగెను. ఇందిరాదేవియు విచారసాగర నిమగ్న యయ్యెను. రాధిక వెడవెడ నావిషయ మెఱింగి నరపా లయ్యెను. శశిభూషణుఁడు జలంధ రపురమును జేరి శ్రీవ