పుట:నీతి రత్నాకరము.pdf/96

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆఱవ వీచిక. గోరియే యతఁడు పంపఁబడిన వాడనియు, వాని మాయా వాక్కుల నమ్మకయుండవలయుననియు, నింతకంటె విశేషించి. మీవంటి మర్యాదాభూషితులకు వ్రాయ నక్క ఱయుండ దనియు, మీసౌజన్యమును విన్న వారము కానఁ గళంకమురాఁ గూడదనునూహచేఁ దెలిపితిమనియు, మాయీ భావమును మీరు విశ్వసింపకయుండినఁ దర్వాత విచారింపవలసి వచ్చు ననియు, నొక్కొక్క లేఖయందుఁ గడుఁ జమత్కారముగా వ్రాయఁబడుచుండెను. ఈ లేఖలన్ని యు శ్రీవత్సాంకదాసునకుఁ బద్మావతి దేవికిని మిగుల విచారమును గలిగింపసా గెను. ఒక్కొక్కసారి యిందు నిజముండకపోవునా యనియు స్పురింప సాగెను. రామదాసుగారియందు నించుకసంశయము గలుగ సాగెను. పిలువని పేరంటముగా వచ్చుటకిదియే హేతువుండునా యనియు వారూహింపసాగిరి. రాధిక కు సంగీత చిత్ర, లేఖనములఁ గలకౌశలము దుష్ప్రవృత్తిని గలుగఁ జేయునదియే యగుటం బట్టి యామె మనకుఁ గోడలుగా నుండి మర్యాద కాపొడునో లేదో యని పలుసారు లనుమానింపసాగిరి. రామదాసున కీవిషయము గోచరించినను యథాపూర్వముగ నున్న ట్లే యుం డెను.

పదిదినము లిట్టియనుమానముల నాయిరువురు పరి తపించుచుఁ దుదకుఁ బరీక్షించి గాని వివాహమున కూఁకోన రాదని నిశ్చయించిరి. శ్రీకృష్ణదా సొకనాఁడు తనమిత్రుడగు శశిభూషణుని బిల్చి యీవిషయమంతయు నెఱిగించి విలాసథామమునకుం బోయి వేషాంతరమునఁ గొన్ని దినములుండి యథార్థ మెఱిఁగిరమ్ము. జాగరూకుఁడవై చరింపుము. నా