పుట:నీతి రత్నాకరము.pdf/94

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఐదవ వీచిక. దుష్కార్యము తెలిసియుండక తప్పదు. ఆయపరాధమునకై వారొక్క సంవత్సరము సాధారణ కారాగారమున నుండవల యును. తొమ్మండ్రు, వ్యాధులు ద్ర వ్యాశ చే నీదుష్కార్యమునకుఁ దమతోడ్పాడును జూపిరి కావున వారు నాలుగు సంవత్సర ములు చెఱసాలయందుండి కష్టములకు లోనగుచుండవలయును. వెంకటేశ్వర ప్రముఖులు నలువురు నసాధారణసాహసము నెఱపి కన్య కా ప్రాణమును గాపాడి ప్రభుత్వమునకు సాయపడి కీర్తిని దెచ్చిరి. కావున రాజసన్మానార్హు లగుదురు. కావున వారలుసువర్నకంకణములను ప్రభువులనుండి పొందఁగల వారు. అనంతా చలశర్మ గారీ విషయమును దమకుఁ దెలిసినపుడే దొరతనమున కెఱిగింపవలసి యుండెను ఆట్లేల చేయరైరని తొలుత నూహించితిని. అద్దానికంటె నిపుడు సాగించిన మహా కార్యమే సమంజసమని యెన్నఁదగియున్నది. కావున వారు రాజసన్మా నార్హులు. వారికిఁ బ్ర భుత్వమునుండి “యార్త రక్షక " బిరుద మొసఁగఁబడు. ఇట్లు న్యాయాధికారి.. అని వ్రాసిన తన తీర్పును జదివెను.

రక్షకభటులు యమకింకరులం బోలు వారు వారినెల్లఁ గారాగారాదిపతి చెంతకుం బిలుచుకొనిపోవుచుండఁ గుంతలుఁడు కంఠమెత్తి " ప్రారబ్ధకర్మణాం భో గా దేవ క్షయః”అన్న న్యాయము నా కనుభవమున సిద్ధమైనది. వేనుకఁ జింతించుట పెఱ్ఱి తనమని పలు కుచుఁ గూడఁ బోయెను. ఆతీర్పును విని యెల్ల వారు న్యాయాధి కారిబుద్ధాచమత్కృతికి న్యాయపరిశీలనమునకుఁ గడు మెచ్చు