పుట:నీతి రత్నాకరము.pdf/93

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

నీతిరత్నాకరము కాలమునఁ బరునియింటఁ జొచ్చి కృత్రి మోపాయముల నొక స్త్రీని గొనిపోవుటయుఁ బై వానికి సమానమగు దుష్కార్యము. ఈమూఁ డపరాధముల నొనరించి పాతాళుడు పశమనింద్యుఁ డయ్యెను.

కర్తా కారయితా చైవ ప్రేరకశ్చాను మోదకః,
సుకృతే దుష్కృతే చైవ చత్వారస్సమభాగినః.

అను ప్రమాణము ననుసరించి కుంతలుఁడు పాతాళు నకు సమానుఁడే యనవలసియున్నది. కాని కుంతలుఁడు పాతాళునిచే నీ కార్యము చేయించినట్లు, చేయఁ బురికొలిపి నట్లు మాత్రము తేల లేదు. కానఁ బాతాళుని కార్యము. నామోదించినట్లు, విశేషించి తోడ్పడినట్లు, నిశ్చయింప వలయు. నే నట్టియభిప్రాయమునకే వచ్చియున్నా ఁడను. ఈవిచారణమును దైవము నెదుట నునుచుకొని పక్షపాతమూనకయే సాగించితిని. ఏవిషయమునను బాతాళుని గుంతలుని క్షమించుటకు లేశ మైన నవ కాశము దొరకదయ్యెను. ప్రథమాప రాధమని కరుణ జూపను గూడ నవకాశము లేదు. ఇది యిత గులకు మార్గదర్శకము కూడ నగును. కావున నామనోనిశ్చి తార్థమును న్యాయసాహాయ్యమునఁ దెలుపుచున్నాఁడను. పాతాళుఁ డామరణము కారాగారముననుండి పాటుపడుచుండ వలసినట్లు, కుంతలుఁడు పడిసంవత్సరములు కారాగృహమున నుండి సామాన్య కార్యములయం దాయధి కారుల యుత్త రువు చొప్పునఁ బ్రవర్తించుచుండవలసినట్లు తీర్మానించుచున్న వాఁడను అర్చకులిరువురు దుష్కార్యమును జూచుచున్న యట్లు మాత్రము తేలెను. కావున వారికి ముందే పాతాళుని