పుట:నీతి రత్నాకరము.pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఐదవ వీచిక. ళుఁడు దోషి యే యని యాతని వాజూలమునుబట్టి కూడ నూహింపనచ్చును. ఆనంతాచలశర్మ గారిసాక్ష్య మిందుఁ బ్రథానము. వేంక టేశ్వరాదులు ప్రత్యక్షముగాఁ బాతాళుని దుండగములఁ బరిశీలించినవారు. వీరిసాక్ష్యము నమ్మక పోవుటకు హేతు వగపడదు. ఇంతకంటే సాక్ష్యముత్తమము లోకముననే యుండదు. భరతపురమునఁ గొందఱు పెద్దమను ష్యుల విచారించితిని. ఈష త్తేని భేదము లేక సాగినది సాగి నట్లే చెప్పిరి. 'కావున నభియోగపక్ష మునఁ దృప్తీకరముగా విషయము నిర్ధారణము చేయఁబడినది. ఇఁకఁ బ్రత్యభియోగ పక్షమునుగుఱించి తర్కించెదను. పాతాళుఁ డనంతాచలశర్మ గారితోఁ దనకు విరోధము గలిగెననియు, వారిశిష్యులగువేంక టేశ్వరాదు లీపన్నా గమును బన్ని రనియుఁ దెల్పిన కారణము లే యాతని నింద్యునిగఁ జేయుచున్నవి ఏలనఁ గారణములన్నియు దుర్బలములు. కేవలకల్పితములు దుష్ట కార్య జనకములు. పాతాళునికడ నున్న కాటుకలు మూలికలు పరీ క్షింపఁగాఁ బరాపకార మొనరింపఁదగియున్నవి. కుంతలుని కడ మంగళసూ త్రాది వివాహోచితపదార్దములు కలవు. ఆ నాఁడు భరతపురమున వివాహము లే సాగ లేదని యెల్ల వారుఁ దెల్పిరి. కావున వీరిరువురు నాలో చించుకొనియే యీదురంత కృత్యమును జేసిరని నమ్మవలసియే యున్నది.

ఈకార్యములు సామాన్యములు కావు. ఒక్క కన్యను నిగ్బంధ పెట్టి యామెయావజ్జీవము దుఃఖపడునట్లు చేయుటయు, నంగీకరింపక యున్న వధింపఁ బూనుటయు సనునవి దుష్కార్యము లనఁదగియున్నవి. ఈ రెండుపను లీయదనున సాగెను. రాత్రి