పుట:నీతి రత్నాకరము.pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఐదవ వీచిక. బిలుచుకొని పోవునప్పటికే పొద్దుపోయెను. అర్చకులు తలుపులు వేసిపోయిరని యెవరో తెల్పినందునఁ బెండ్లి వారు మరలి పోయిరి. కొంతదూరము వచ్చితిని గదా ప్రదక్షిణము చేసియైనఁ బోవుదమని పోవఁగా ద్వారములు మూయఁబడక యుండెను. సంతసించి లోపలికింబోయి ప్రదక్షిణము చేసి నర సింహమూర్తి దర్శనము చేయఁ బోవఁగనే నన్ను నీ వేంక టేశ్వరాదులు కట్టివై చిరి. వివాహార్దమై దర్భలు తీసికొనిపోవుట పురోహితులయల వాటు. దర్భలు లేకయున్న శుభకార్యములు సాగవు. నన్ను గట్టి వేయునపు డిదియేమన్యాయమయ్యా యని యడిగితిని. వేంక టేశ్వరులు మనకుఁ దగినవాఁడు దొర కేనని కట్టివేయుఁ డనెను. ఇదియే నావాదము. సత్యమును 'బాలింపఁ బార్ధించెదనని కుంతలుఁ దూరకయుం డెను. తక్కిన 'వారు తొమ్మండ్రు తోఁచిన ట్ల సంగతముగా మాటలాడిరి.

రాధికను బిలిచి మర్యాద ననుసరించి కూరుచుండం బనిచి యభియోగమును వినిపించి యింక నేమైనఁ జెప్పవలసినది కలదా యని ప్రశ్నింప లేదనియె. ఆపత్రము నీచే వ్రాయబడి నదా యనియడుగ నౌననిపలికెను. ఈకన్నియనేమైనఁ బ్రశ్నింప వలయునేని యా ప్రశ్నముల మాకుం దెల్పిన మే మడుగుదు మని న్యాయమూర్తి పలుకఁ బాతాళు నిబంధు ఏకపండితుఁడు వచ్చి యసందర్భముగా నేమేమో ప్రశ్నింపఁగా నవి ప్రకృతోప యుక్తములు కావని తిరస్కరింపఁబడియెను. - అర్చకు లిరువురును డగ్గుత్తికలఁ దమ రాచరించినపని యంతయు నున్న దున్నట్లు చెప్పిరిగాని రాధికనుగుణించి