పుట:నీతి రత్నాకరము.pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

నీతిరత్నాకరము

ఆనగరమున నొక ధనవంతుఁ డుండెను. అతని పేరు శ్రీనివాసుదాసు. తలిదండ్రులాతనికి వివాహమువ ఱకుఁ గలసంస్కారము లొనరించి గతించిరి . భార్యంగూడి శ్రీనివాసదాసు సద్వృత్తి గాలముఁ బుచ్చుచుండెను. లక్ష్మీనారాయణులవలె వారలున్నవారని యెల్ల వారు వాడుచుండిరి. పరోపకారము వారికి నైజ గుణము. కాని ముఖస్తుతులను జేయువారిని మాత్ర మాదాసాదరింప కుండెను దీనాంధబధిరాదు లాత నియిల్లు కల్పవృక్ష ముని కాచుకొని యుందురు. అన్నదానము వస్త్ర దానము నను నీ రెండు నాతఁ డెక్కుడుగాఁ చేయువాడు. తక్కినదానములు యథోచితముగా జేయుచుండును. బంధువుల రాకకు బరిమితిలేకుండెను. వ్యాపారమున ధన మెక్కువగా లభించుచుండుటచే వ్యయము నాతనిమదికి లెక్కింప దగినది కాకయుండెను. ఆవ్యాపార ము న్యాయము నతిక్రమింపక చేయఁబడుచున్నందున దినదినాభి వృద్ధి నొందుచుండెను,

ధర్మంబు చెరుపఁ జెఱచును,
ధర్మము రక్షించువారిఁ * దా రక్షించున్ .

అన్న సూక్తి యేల తప్పును! ఆ వ్యాపార మాతని కాలమున నారంభింపబడినది కాదు. కులవృత్తి. కావున శాస్త్రీయమే యన వలయుఁగదా.

శ్లో. “స్వే స్వే కర్మణ్య భిరతస్సంసిద్ధిం లభతే నరః."

అను భగవద్గీతా వాక్యము ప్రమాణము కదా. ఆవ్యాపారమునే పాటించి కులవృత్తియని భగత్ప్రతిపాదితమని కర్తవ్య మని యాతం డొనరించుచు దేహమంతయుఁ గన్నులుగా