పుట:నీతి రత్నాకరము.pdf/89

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

నీతిరత్నాకరము యా మెమగఁడు పంతము పట్టెను. అపుడపుడు నన్నా మాట చే దూలనాడువాఁడు. ఇది యేగాక మఱియొకవిరోధము కలదు. ఆతనికడకుం బోయి భూతచికిత్స చేయించుకొనువారలు కోందఱట నుపయోగము లేమి నాకడకు వచ్చిరి. వారి కీవలసిన ద్రవ్యము లాభము లేదని యీయకుండుట కల దని వింటిని. 'నాకడ వారికి మేలు గలుగును తన ద్రవ్యము నేను బోఁగొట్టితినని నా పై నాయనకసూయ. శిష్యుల మూలమున నీపని చేయించేను. నేను భరతపుర దేవాలయమునకు బలుసారులు పోవుచుందును. ఆకాళికాదేవి మా యిలువేల్పు. ఆర్చకులు నన్నెఱుఁగుదురు. ఆనాడు నేను శుక్ర వారపూజకోఱకుఁ బోయియుండఁగా నన్ను గట్టివై చిరి. రాధికను బిలుచుకొనివచ్చినది వారే. అనంతాచలశర్మకు శ్రీని వాసదాసునకు మిక్కిలి సావాసము వారేమి మాటలాడి కొని యీ కార్యము చేసిరో భగవంతునకే యెఱుక, ఈఖడ్గము గాని యీమూలికాదులుగాని నావి కావు. ఇంతకంటే నే నేమియు నెఱుంగను. న్యాయమును బరిశీలించి నావాదమునఁ గలసత్యమును జిత్తగించి తమ చిత్రానుసారము చేయుఁడు. కడుంగడు బీదవాఁడను. మానవులసాయము నాకేమాత్రము లేదు. సత్యమునే నమ్మియున్నా ఁడనని తనవాదమును ముగిం చెను.

కుంతలుఁడు తన ప్రతివాదము నిట్లు సాగించెను. భరత పురమునఁ గొన్ని వివాహములు చేయింపఁ బోయియుంటిని. శుక్రవారము కదాయని నృసింహస్వామి దర్శనమునకుఁ బోయితిని. వివాహములు చేయించి దేవాలయమునకు వధూవరులం.