పుట:నీతి రత్నాకరము.pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఐదవ వీచిక. వాలికడ నిలుచుండెను. దోషులారా! మీరు సప్తమీశుక్ర వారమున రాధికను గుటిలమార్గమున నెత్తుకొనిపోయినట్లు, భరతపుర కాళికాలయమున నామెను బలవంతపఱచి పాతా ళుఁడు పెండ్లి చేసికోనఁబూనఁగాఁ గుంతలుఁడు పురోహితత్వము నడుప సిద్ధముగా నుండ నీశ్వరాను గ్రహమున వేంక టేశ్వ రాదులు నల్వురు వచ్చినట్లు, పాతాళుడు వివాహమున కంగీక రింపని రాధికను వధింపఁబూనినట్లు, వేంక టేశ్వరాదులు వారించి మిమ్ములఁ గట్టివై చినట్లుగా నభియోగము చేయఁబడినది. వా రభియోగమునఁ జెప్పియున్న యట్లు మీరెల్ల నందుఁ గట్టి వేయఁబడియే యుంటిరి. ఖడ్గము కొన్ని మూలికలు కొన్ని కాటుకలు నీసంచియందుఁ గలవని స్పష్టపడుచున్న యవి. ఈ "కారణములవలన మీరు దుష్కృత్యము చేసితిరని నమ్మవలసి యున్న యది. దీని కెల్ల మీ ప్రతివాదము తెలుపవలయును. ప్రతివాదము సత్య సమ్మత మైన యెడల మీకు నిర్దోషు లనఁ బడుదురు. లేనిచో సదోషు లనఁబడుదురు. అభియోగము సత్యసమ్మతమని మీ వాదమునుబట్టియు దృఢపడు నేని మీరు శిక్షా పాత్రులగుదురు. కావున మీరు యథార్థమగు ప్రతివాద మును దెల్పుఁడని యెఱింగించెను.

పాతాళుఁడు తనవాదము ని ట్లెఱింగించెను. న్యాయ మూర్తీ! అనంతాచలశాస్త్రి గారికి నాకు సహజవిరోధము. అపుడపుడు మంచినీళ్ల బావికి మాతల్లి యుండిన కాలమున నీళ్లకుఁ బోవుచుండెడిది. వారిభార్యయు నచ్చటికి వచ్చునంట. ఏదో యొక హేతువునుబట్టి కలహించుకొనిరఁట. నన్నేట్టు లైనఁ గారాగృహమునకు, బంపునుపాయము చేయుదునని