పుట:నీతి రత్నాకరము.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ నీతిరత్నాకరము తెలుపుఁడనియు దానిని మే మంగీకరింతుమనియు నీయభి యోగము తీర్మానిఁపబడిన వెంటనే తమకుం దెలుపుదుమనియుఁ బార్ధించి శ్రీవత్సాంకదాసును గురువర్యులగు రామదాసు గారిని బ్రయాణముచేయ సమ్మతించెను. వారును జాలంధర పురమున కరిగిరి.

నగరాధ్యక్షుఁడు విచారించుదిన మిదియని నిర్ణయించి తెలిపెను. ఆనాడు శిబికను మోసికొనిపోయిన యేడుగురు వ్యాధులును జిక్కరి వారిని జెఱసాలయం దుంచిరి. భరత పురమునుండి యర్చకులకు మణికొందఱకు నాహ్వానపత్రిక లంపఁబడియెను. ఎల్లరు రాజకీయ మందిరమునఁ గూడిరి. రాధి కయు నిందిరా దేవియు దాసికలును బోవవలసివచ్చెను. ఇందిరా రాధికలు శిబిక నెక్కి వెళ్లిరి వారికొకగది నిర్ణయింపబడియుండెను. వారి యనుచరీబృంచము కూడ నందే యుండ నాజ్ఞ యయ్యెను. నగరాధిపతి తనపీఠము నధిష్టించెను. నగర మునఁ గల పెద్దలు వెక్కండ్రందుఁ జేరిరి. రక్షకభటాద్యక్షుఁడు తనయుద్యోగులతోడ భయంకరాకారమున నరు దెం చెను. విమర్శకు లుచితపీఠముల గూరుచుండిరి. దోషులు పాతాళుఁడు కుంతలుఁడు తొమ్మండుగురు వ్యాధులు నిగళ బద్దులై నిలుపఁబడిరి. వారి యిరుపార్శ్వములయందుఁ దళతళ లాడు నసీపు త్రికలంబూనిన రక్షకభటులు నిలిచియుండిరి. పాతాళ కుంతలులు తలలెత్తక వంచియుండిరి.

న్యాయ విమర్శము.

నగరాధిపతి యొక యుద్యోగిని బిల్చి దోషుల చెంత నిలుచుండి 'నాపల్కుమాటల వారికిం జెప్పుమని పంప నాతఁడు