పుట:నీతి రత్నాకరము.pdf/86

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఐదవ వీచిక. మనియుఁ దెల్పి పోయెను. రెండవదినమే శ్రీనివాసదాసుం జూచెను. అతఁ డించుక లజ్జించి యట్టె మోమువంచెను. రామదా సాతని నాణ్యాసించెను. అతఁ డంతట లేచి యెల్లవారును విను చుండ రామదాసుగారు తనతో నా రాత్రి తెల్పిన గూఢార్థము గలమాటలం దెల్పి వారిమహత్త్వమును గొనియాడెను. ఎల్లరు నచ్చెరు వుపడిరి. శ్రీవత్సాంకదాసును దనకా మఱుదినము తెల్పినవార్తలం దెల్పెను. ఎల్ల వారు విని కష్టములు గట్టెక్కినవి. కావున నిఁక శుభప్రయత్నము సాగింపవచ్చుననిరి. “శుభస్య శీఘ్హ్ర"మ్మను న్యాయము ననుసరించుటయే మేలని రామదాసు చెప్పెను. పెద్దలందఱు “తథా స్త”నిరి.

ఆదినము మఱుదినము రామదాసుంగూడి శ్రీవత్సాం కదా సందే యుండి రాధికకుఁ గల విద్యాపాండిత్యము కలా కౌశలముఁ బరికించి తనదే భాగ్యమని పరమానందభరితుఁ డయ్యెను. ఆ మెశీలము నెల్లరుం బొగడుట వినఁబడినపు డాతని యానందపారవశ్యమునకుఁ బారము లేక యుండెను. ఇట్లు రాధి కాశీలవిద్యా వైశద్యములు వారి యింటి మర్యాదలు కాంచి తగినసంబంధమును బరమేశ్వరుఁడు రామదాసరూపమున నను గ్రహిం చెనని తలంచుచుఁ బ్రయాణముచేయ ననుమతి వేఁడ శ్రీనివాసదాసు మహాత్ముల రాక మాభాగ్యమున మీమూలమునఁ గల్గినది. కావున నిక సుముహూర్తము నిశ్చయము చేసికొని పొమ్మని యభ్యర్థింప నాదినము నిలి చెను, అభియోగవిచారణ మెప్పుడో తెలియనందున నద్దాని కాయది యడ్డుగానుండ రాదని యెల్లరభావమైనందున జాలంధర పురము నుండియే రామదాసుగారివలన నిశ్చయింపఁబడిన ముహూర్తము