పుట:నీతి రత్నాకరము.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

92 నీతిరత్నాకరము నుండి వాజూలపుఁ బద్దతి నిర్వహించెను. మరలఁ బిలుపింతు మనియు నాఁటికి రాజకీయ న్యాయస్థానమునకు రావలయు ననియు. దెలిపెను. రాధికయు నిందిరా దేవియుఁ దమయిడు మలఁ దలంచుకొనుచు నీగండము తప్పించిన “భగవతి యను విశ్వాసమున నూఱడిల్లిరి. ఈవార్త క్రమక్రమముగా జాలం ధరముదనుకఁ బ్రాఁకెను.

శ్రీనివాసదాసు పయనము సాగించినదినమే రామదాసు శ్రీవత్సాంకదాసుతో మాటలాడుచు రాధిక కొక్క కష్టము వచ్చుననియు, నది విచిత్ర రీతిగాఁ దప్పుననియు నాయాపదచే నా మేవిఖ్యాతి లోకమున వ్యాపించుననియు నామె కోడలు గాఁగలభాగ్యము నీయదృష్టమునఁ గలుగఁగలదనియుఁ ద్వరగా విలాస ధామమున కరుగవలసియుండుననియు నీవిషయ మితరులకుఁ దెలుపవలదనియుఁ దెల్పెను. "రామదాసు యోగ దృష్టిగల మహాత్ముఁడని శ్రీవత్సాంకదాసు నమ్మి యున్న వాఁడు గనుక నావాక్యములు తప్పక ఫలించుననియు నేవిధమగు కష్టము గల్గునోయనియు విచారించుచుండెను. ఆమూఁడవ దినమే యీవార్త యించుక మార్పుతోఁ దెలియవచ్చెను. పిడుగుపాటువంటి యావార్త విని భార్యయుఁ గుమారుఁడును విచారింపసాగిరి శ్రీవత్సాంకదాసు మాత్రము వారి నూఱడిల్లఁ జేసి తాను బ్రయాణమై రామదాసుంగూడి విలాసధామము నకుఁ బోయెను. పయనముచేయునపుడు భార్యతో వివాహ ప్రయత్నములు క్రమముగా సాగించుచుండుమనియు నీవార్త నాకింతకుముందే తెలియుననియుఁ దప్పక 'రాధిక మనకుఁ గోడలగుననియు ద్విగుణితోత్సాహమునఁ బనులు సాగింపు