పుట:నీతి రత్నాకరము.pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఐదవ వీచిక. నీగండముతప్పుట కాభగవతియను గృహమే కారణమని నమ్ముచుఁ దలిదండ్రులఁ జూడ నాతురంపడుచుఁ బోయెను. శిబిక నతిజవ మునఁ గొనిపోయిరి. తోలి జాము దాఁటకుండ నగరమును జేరిరి. మందిర ద్వారముననే శ్రీనివాసదాసు సభార్యుఁడై కాచియుండెను. శిబిక దింపఁగా నమ్మా యని పిల్చుచు నాదంపతు లట్లే మూర్చిల్లిరి. రాధిక యేమో పలుకఁబోయి మాటరాక యట్టె లేచి వారలపై ఁ బడి విస్తృతిఁ గాంచెను. పెద్ద లెల్ల వారికి నుపచారములుచేసి యెట్లో తెప్పిఱిల్లఁ జేసిరి. అతికష్టముమీఁద నింటిలోనికి నెల్లరఁ జేర్పఁగలిగిరి. ఆదంపతుల విలాపము రాధిక వ్యాకులపాటు పాషాణ హృదయుల కైన జాలిని బుట్టింపక మానదు. రెండవజాము దాఁటకుండ నందఱు పెద్దలు వారి నూఱడించి యిందిర యుపవాసమును దెలిపి యెట్లో భుజింపఁ జేసిరి రక్షకు లెల్ల గృహము నప్రమత్తులై కాచుచుండ వారు శయనించిరి రాధికను వదలక యిందిర శయనించి ప్రాణముల నిలుపుకొనఁగ ల్లెను.

మఱుదిన మనంతాచలశర్త గారిని బిలువంబంచి శ్రీనివాసదాసు శ్రద్ధాభక్తులు వెలయ బహుమానించెను. పుత్రి కాభిక్షము పెట్టిన మహత్తులు తమ రే యని కొనియాడెను. మీఋణ మెన్ని జన్మ ములకైనఁ దీఱదని విన్న వించెను. తమరీ సాయము చేయఁగల్గు టెట్లో తెలుపుఁడని ప్రార్థించెను. నగ రాధిపతియు నం దుండెను. శర్మయుఁ బూస గ్రుచ్చినట్లు మొదటి నుండి కొసవఱకుఁ దెలిపెను. ఎల్లరు నాశ్చర్యంపడిరి. సహజ వాత్సల్యము గల యాపండితుని గొనియాడిరి. నగరాధిపతి పాతాళుని యకృత్యమునకు వెఱఁగంది యనంతాచలశర్మ