పుట:నీతి రత్నాకరము.pdf/82

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఐదవ వీచిక. చిన దనుక నూరక యుండి యపుడుకదా తమదర్శనమునకు రావలయును ఇది మంచిన్యాయమార్గ మే.

అనుచుండునంత నగరాధిపతి దాసు రాక విని యచటి కరు చెంచెను, వారి రాక నెఱింగి రక్షకభటాధ్యక్షుఁడు కాలికి బుద్ధి చెప్పెను.

నగరాధిపతి దాసునూఱడించి యిట్టి యకార్యము మన నగరమున నీవఱకు సాగ లేదనియు, నిది యచ్చెరువును గల్గించు చున్న దనియు, నీశ్వరాసు గ్రహమునఁ దమపుత్తికకు నించుకయు నాపదగలుగకుండ నాపర మేశ్వరుఁడే కాపాడెననియుఁ దెలిపి మీయనుమతియైనచో నాదుష్టుని మాస్వాధీనము చేసికొని విచారింతుమనియు, మర్యాద నతిక్రమింపక మీ యింటికి వచ్చి ' రాధిక నడుగుదుమనియు, నిపుడు పాపమని వదలిన నిట్టివాం డ్రింక నెందఱకో మార్గమును జూపించువా రగుదురనియు, నది నగర మునకే యపకీర్తిని హానిని దెచ్చుననియు, మంచిమాటలఁ దెలిపెను. దాసు నేనిపుడు పోయి వానిం జూచి తమకుఁ దెలు పుదుననియె నగరాధిపతి దాసుగారూ! నాయీమాట నాల కింపుఁడు. మీరిపు డచ్చటికిం బోవుటుచితము కాదు. ఆదురా త్ముని జూడఁగ నే మీకుఁ బట్టశక్యముగాని యాగ్రహము పొడ సూపును. ఏమిసొగినను ముందు మీ ప్రఖ్యాతి కయ్యది మచ్చవంటిదగును. నామాటం బాటించి మీరు పోవుటుడిగి కుమారికను బిలువనంపుఁడు. అచ్చటి తక్కిన కృత్యములు మాయధీనములుగ నొనరింపుఁడని సమర్యాదగాఁ బలి కెను. దా సాపలుకులను మన్నించి తమ భావమునే యనుసరింతునని విన్న వించెను.