పుట:నీతి రత్నాకరము.pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

నీతిరత్నాకరము వచ్చెను. మీకంటే ముందే దుష్టుఁడగుపాతాళుని బంధించి యుంచినారు. మీకాశ్రమముకూడ నక్కఱ లేదు. మేమే వానిని దెచ్చి మీ కార్యాలయమున నప్పగింతుము తమరు సుఖంబుండుఁ డని దాసు విన్నవించెను. ఆయధ్యక్షుఁడు మండిపడి వానిం గట్టివేయునధికార మితరులకు లేదు. మీవా రెట్లు బంధించిరో విచారింపవలయునని కఠినవాక్కులం బలికెను. దొంగ పాఱిపోవు చుండఁ జూచిన వాఁ డేమి చేయవలయునో యెఱుంగఁ గో రెదనని దాసు ప్రశ్నింప నపుడే వచ్చి మాకుం 'దెలుప వలయును.

దాసు..ఆమీఁద మీ రేమిచేయుదురు?

అధ్య-వాని వెంటఁగొని భటులు చోరుఁ బట్టఁబోయెదరు ?

దాసు-వాఁ డగవడు టెట్లు ?

అధ్య— వానిం జూపునట్టిపని యాతనిదే

దాసు-వాఁ డీలోపల నాద్రవ్యమును బాడు చేసిన నిది మాదని గుఱుతించుటెట్లు ?

అధ్య- వాని వెంటఁ గొందఱు పోవలయు. ఆవస్తువులను వాఁడేమీ చేయకయుండఁ గాపాడుచుండి మాకుం జూపవలయు.

దాసు- ఈదినము దొంగలు వత్తుగని తెలిసికొని మనుష్యులను సిద్ధముగా నుంచుకొని కొందఱిని వారి వెంటఁ బంపి కొందఱు మీతావునకు 'రావలయునా? అంతియ కాక తెలిసియున్న నూరకయుండి వారు కన్నము పెట్టి లోప లికివచ్చి వస్తువుల నపహరించి కొనిపోవఁ బ్రయత్నిం