పుట:నీతి రత్నాకరము.pdf/80

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ వీచిక.

తెచ్చుకొనుచు గృహముఁ జేరెను. లోపలికింజని యిందిరా దేవిం గనుఁగొనియె. కూరుచుండియున్న యిందిర లేవఁబోయి రాధికా యని యట్టే కూలఁబడియెను. ఆ మెంగాంచి శ్రీనివాస దాసును మూర్ఛిల్లెను. ఎన్ని యో యుపచారము లొనరింప నించుక తెలివిగల్లి కూరుచుండెను. ఇందిర నూఱడింపుఁడని యందఱు హెచ్చరించిరి. ఆ పెను లేవనెత్తి వీపు నిమురుచు నీశ్వరుఁ డను గ్రహించెను. దుఃఖంపకుము. రాధికం గొనివచ్చెద. ఊఱడిల్లుమని పలుమాఱులు హెచ్చరించెను. ఆమె మాట! లాడఁజాలక రాధి కాకరాక్ష రవిలసత్పత్రిక నొసం గెను. దానిం జదువుకోనుచు దీనాననుండగుచు నశ్రూదకముల నాపత్రి కను దడుపుచుఁ గొంత సేపుండి యించుక యూఱడిల్లి శ్యామసుంద రాదుల యుపకారమునకుఁ బారము లేదని కొనియాడుచు ననం తాచలశర్మ గారి పట్టుదలకుఁ బరమానందము నొందుచు నిఁక భరతపురమున కరుగు ప్రయత్న మొనర్పుమని కాహళునకుం దెల్పెను.

అంత రక్షకభటాధ్యక్షుఁడు భటులం గూడి వచ్చి, శ్రీనివాసదాసుం గనుంగొని తమయభియోగము విచారింప వచ్చితిమి. భగతపురమున నాకుమారియు నామె నెత్తుకొని పోయిన దుష్టుఁడు నున్న యట్లు కనుఁగొంటిమి. మేమిపుడే పోవుచున్న వారము. ప్రయాణోచిత ప్రయత్న ముం జేసి, మమ్ము సాగనంపుఁడు అన దాసు మీ రచ్చటి కేగి యేమి చేయ నూహించితిరో వినఁగో రెదనని ప్రార్థించెను. 'మే ముచ్చ టికింబోయి యాదుష్టుని బంధించి మీకుమారికను దీసికొని మా కార్యస్థానమునకుం బోయి విచారింతుము అని బదులు.