పుట:నీతి రత్నాకరము.pdf/79

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 నీతిరత్నాకరము

నేను వచ్చి మీము దర్శించెద, దేవికి నైవేద్యము కాఁగా నాకు భోజనము పెట్టుదురు. మీ రించు కంతయుఁ జింతింపకుఁడు. నన్నుం జూడఁగలరు. నేనును మిమ్ము సేవింప నువ్విళ్లూరు చున్న దాన. ఇపుడింతకంటే విశేషించి తెలుపుదగు వార్తలు లేవు. భయముమాని యుండవలయును.

ఇట్లని విన్న వించు మీ ప్రియ పుత్రిక రాధిక. కృష్ణాష్టమి స్థిరవారము.”

ఈ లేఖను గైకొని యాశ్వికు లరిగి యిందిరా దేవి కిచ్చిరి. ప్రియకుమారికా హస్తాక్షరములం దిలకించిన యిందిరాదేవి సమ్మోదమునువర్ణింప నెవ్వకి కేఁ దరంబే! ఆమె మరలమరలఁ జదు వుచుఁ దమవారి కెల్ల వినిపించుచుఁ గొంత కాల మాయా మోద మునఁ బ్రోద్దెంతయెక్కి నదియు నెఱుంగకుండెను. మధ్యాహ్న మైనది. భుజింపవలయునని యెందఱో ప్రార్థించిరి, జలపానమే భోజనమని బదులు చెప్పి యిందిరా దేవి యూరకుండెను. రాధిక వ్రాసినపత్రికయే యామె కానాడు ప్రొద్దుపోవఁ జేయుచుండెను. నగరవాసులంద ఱానాఁడు శ్రీనివాసదాసగృహముననే యుం డిరి. వచ్చువారికిఁ బోవువారికి విరామము లేకయుం డెను. వారితో సంభాషించుటచే నిందిరా దేవి బ్రదుకఁజా లేనుగాని లేక యున్న నీలో కమును వీడి యే యుండును.

సూర్యాస్తమయమునకు ముందే శ్రీనివాసదాసు విలాస ధామమును జేరెను కొంతదూరముననే "కాహళుఁడు వేచి యుండెను గాన దర్శించి రాధికా కుశలవార్తను దెల్పెను. వానిం గూడి యావార్తలనే యాలకించుచు నగరమును జేరి యెడ నెడఁ బెద్దలూ ఱడింపఁగా నించుక చింతించుచు ధైర్యము