పుట:నీతి రత్నాకరము.pdf/78

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

కదా యని ప్రార్థించి యాపాదతీర్థమును బుచ్చుకొని నిరశన వ్రతయై భర్తయా గమనమును బ్రతీక్షించుచుండెను నాలుగు గడియల కొక్క సారి భరతపురమునుండి సేవకులు గుఱ్ఱము లెక్కివచ్చుచు రాధిక కుశలమును దెలుపుచుండిరి. శనివార ముదయమున 'రాధికయు నాలయముననే స్నానము చేసి తల్లిగా రంపిన వస్త్రములం దాల్చి భగవతిం బూజించి ప్రాణరక్షకు లగు వేంక టేశ్వర ప్ర భృతు లొసంగిన యుపహారమునుం గొని జనకునిం జూడంగోరి కూరుచుండి తన ప్రియజనని కిట్లు లేఖ వ్రాసెను.

"ప్రియజననీ! రాత్రి, యేమచ్చుమండుశ క్తివలననో విస్తృతనై పడియుండి యీ కాళికాలయమున మేల్కొలుపం బడితిని. పాతాళుని కరవాలమునకు బలినౌదునని నిశ్చ యించుకొని మిమ్ములను గష్ట పెట్టుదాన నైతిఁ గదా యని దుఃఖించుచు నవకాశ మొసఁగఁబడదని యాదురాత్ముండు హెచ్చ రించినందున నాతనిం బెండ్లియాడుటకంటె దేవీసాన్ని ధ్యమున మరణించి మరల మీకుఁ బుత్రికనై పుట్టుటయే సముచితమని తలంచి ధ్యాననిష్ఠ. నుంటిని. తమ యాశీర్వచనమ హత్త్వ మెట్టిదో యీ శ్యామసుందరాదులు సలువురు శస్త్రపాణులై వచ్చి యా క్రూరుని బంధించి నన్ను గాపాడిరి. వీరియప్పును దీర్చుకొనుట కొక్క జన్మము చాలదు. నన్ను సోదరికంటే నెక్కుడు గారవించుచు నిద్ర లేక కాపాడుచున్న వారు. ఉషహార మిచ్చివి. ఈ రీలేఖయందఁగనే యనంతాచలశర్మను బిలువం బంపి సపర్యలం దన్పుఁడు. ఆమహాత్తునిశిష్యు లే యీ నలువు రట. వారు పంపఁగా వచ్చి కాచియుండినఁట. జనకులు రాఁగా