పుట:నీతి రత్నాకరము.pdf/76

ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ వీచిక

73

కన్నీరు మున్నీరుగానుండ మాటలాడఁజాలక పయనము సాగింతమా యనియెను. ఈగుఱ్ఱము లలసినవి. ఆయాయితావుల నశ్వముల నునిచి వచ్చితిమని వారలనిరి. వీరి నందే నిలిపి యలసిన గుఱ్ఱముల నించుక సేదదీర్చి రేపు పయనముసాగింపుఁడని 'వారల కాజ్ఞాసించి తాను బ్రయాణము చేసెను. కొంతదూరము రాఁగా నండు గుఱ్ఱములు సిద్ధముగా నుండెను. వాని నెక్కి పరి జనులు దానును దారింబట్టి పోయి యిట్లే గుఱ్ఱముల మార్చుచు సాయంకాలము కాకమునుపే విలాసధామమును జేరెను.

ఇపుడు భరతపురవృత్తాంతము తెలుపకయున్నఁ గథ విశదముగాఁ దెలియదు. భరతపురమునుండి శ్యామసుందరుఁ డొక యర్చకుని మఱికొందఱనుగూడి కాఁగడలం గొని విలాస ధామమునకుఁ బోయెను. చిటిపోటిచినుకులు వానికిందోడు మెఱపులు వానినిమించు గర్జితములు తమ్మడ్డుచుండఁగా నెట్లో మూఁడవ జాము వెళ్లునప్పటికి నగరమును జేరెను. అత్యంతము పొడవువెడలుపుగల యానగరమునఁ బోయిపోయి కాహళుఁడు జాలంధరపురమునకు నాశ్వికులంబంపిన యొక్క క్షణమునకు శ్రీనివాస దాసుగారియిల్లు చేరెను. శ్యామసుందరుఁ డందుఁ గలవారి కెల్లం గ్రొత్తవాఁడు. ఐనను రాధికాకుశలమును దెలుప వచ్చితిమని గట్టిగా, బలుక నందఱులికిపడి యెవరో కనుఁగొనుఁడని పలుకుచు రండి రండి యని పిలువఁగా నందఱు లోనఁ బ్రవేశించిరి. ఇందిరా దేవి శవప్రాయముగాఁ బడియుండియు రాధి కాకుశలమును దెలుప నెవ్వరోవచ్చిరనువార్త యమృతధారవలె శ్రుతివివరముల పోఁక నులికిపడి లేచెను. ఇంతలో శ్యామసుందరుఁడు తక్కిన