పుట:నీతి రత్నాకరము.pdf/74

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

71

ళుఁడే రాధికం గోరియున్న వాఁ డనియు వాఁడు క్షుద్ర విద్యా పారంగతుండనియు నెవ్వరో చెప్పిరి. ఇందిరయు నగునని యంగీకరించెను. ఎల్లరును జింతాసాగరమున మునింగిరి.

రక్షకభటు లరుదెంచిరి. రాధిక నెత్తికొనిపోయిన వాఁ డెవ్వడో చూపినఁ బట్టుకొందుమని వారభయహస్తమిచ్చిరి. వాని పేరు, వాఁ డుండుతావును జూప నెవరినైనఁ బంపుఁడని వారు త్వర పెట్టసాగిరి. ఏత్రోవనుండి యింటిలోనికిం దిగెనో చూచినవారు కొందఱుండవలయు ననిరి. వారు సాక్ష్యము చెప్పిన మీద వాని దండితుని జేయుదుమని ప్రల్లదంబు లాడిరి. ఇన్ని గుఱుతులు చిక్కిన మేమే పట్టుకొనఁజాలమా యని కాహళుండనియెను. ఈసందడిలో మూఁడవజాము వెళ్లిన గుఱుతుగా గంట మ్రోఁగెను. నగరమునఁ గలవా రెల్ల రాశ్చర్య పడసాగిరి. ఎందుఁజూచిన నీవార్తయే చెప్పుకొనసాగిరి. పాతాళునికృత్యమే కాని వేఱోకరిపని యిది రాదని యెల్లరు నిర్ణయించిరి. అప్పుడే జాలంధరపురమున కంచెగుఱ్ఱముల నెక్కి సేవకు లరిగిరి.

ఆశుక్రవారము రాత్రి యే భోజనానంతరము రామదాసుతో మాటలాడి తెల్ల వాఱుజామునఁ దదనుజ్ఞాతుఁడై విలాస ధామమునకు శ్రీనివాసదాసు ప్రయాణమయ్యెనని యింతకుముందే పాఠకమహాశయులు చదివియుందురు. జాలంధరపురసీమ దాఁటినప్పటి నుండి యనేకదుశ్శకునములు కనఁబడ సాగెను. ఒకదానికంటే వేఱోకటి యమంగళ దాయకముగా నాతనికిం దోచుచుండెను. ఒక్కచోఁ గూరుచుండి కొంత దూరము వెనుకకుం బోయి పాద ప్రక్షాళనము చేసికొని యం