పుట:నీతి రత్నాకరము.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

70

నీతిరత్నాకరము

పించెను. ఆమె లోపలికింబోయి వారిని బొరలించి లేపినను బలుకరైరి. అదిగని కాహళుఁడు మిత్రమా యేమిది యని యడుగ నాతఁడును క్షుద్ర విద్యా నిపుణుండు కాన దీపము లార్ప వలయునన నట్లే చేసి కొత్తదీపముల వెలిగించెను. ఆదీపచ్ఛాయ వ్యాపింపఁగ నే యందఱులికిపడి లేచిరి. కాహళుని గని భయం పడిరి. ఇందిరా దేవి. యింకను మేల్కొనలేదే యని యాదీపము నార్పునట్లు చేయఁగా నా మేయు మేలుకొనియె. ఎల్లరు రాధికామందిరమునకుం బోవ రాధిక యగపడదయ్యెను. తలుపు తెఱచియుండుటం గాంచిరి. ఇంతలోఁ 'బెక్కంద్రు, పెద్దమనుష్యులు గూడిరి. నలు దెసలఁ బరికించిరి. పాదచిహ్నములు కనఁబడఁగా నిందు మనుష్యుల యడుగులగుఱుతు లున్న వనిరి. ప్రాకారమున కవ్వల మఱికొందఱు యడుగులజాడ లగపడఁగా విచారింపసాగిరి. ఇంతలో నెవ్వరో యీత్రోవనే యొక శిబిక నెత్తుకొని కొందఱు వారి వెంటఁ గొందఱు పోయిరని తెల్పిరి. అప్పటి కొకజాము దాఁటినదని తెలియవచ్చెను రెండవజాము దాఁటినగుఱుతుగా ఘంటానాదము వినంబడియెను. రాధిక నాత్రోవనే శిబికలోనునిచి యెత్తుకొనిపోయి రని నిర్ణయించిరి. ఎల్లరు నింతటి యన్యాయము సాగునా యని చేతులు పిసికికొన సాగిరి. ఇంద ఱుండియు నిట్లు జరగుటకు హేతువుండవలయునని మరల నింటికిం బోయి పరీక్షింపఁగా దీపతైలము వివర్ణముగా నుండెను. కృత్రిముఁ డెవ్వఁడో వసరు పిండి యెల్లరను మూర్ఛిల్లఁ జేసెననియు, రాధిక నిల్లుదాఁటించి కొనిపోయెననియు నిశ్చయించిరి. ఇంతటి ఘోర కృత్యము చేయు నంతపగవారు కలరా యని విచారింపఁగాఁ బాతా