పుట:నీతి రత్నాకరము.pdf/72

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

69

ఇంక విలాస ధామమున శ్రీనివాసదాసుగృహమున జరిగిన వార్త లరయుదము. 'రాధికం దీసికొని పాతాళుఁడు పోయిన పిమ్మట గృహమును రక్షింప నియుక్తుఁ డై యున్న కాహళుఁడు రెండవయామము రాఁగా నరుదెంచి గంభీరస్వరంబున భటులం బిలి చెను. వార లప్రమత్తులై యుండిరి. ఇంచుక లోపలికిఁ బోయెను ఆడువారందఱు శవములభంగిఁ బడియుండిరి. కాహళుఁడు మరలఁ బిలిచెను. పలుకలేదు. అచ్చెరువంది. మరలఁ బిలిచెను. ప్రతిధ్వని రాలేదు. ఏమిది యని మఱికొంతలోపలికిం బోయెను. భోజనశాలలో నెల్లరు శయనించి గాఢనిద్రలో నున్న యట్లు కనఁబడఁగా మరల నందుండియే పిలిచెను. కదలకమెదలక వా రుండిరి. సేవకులంగూడి 'చెంతకుం బోయెను. ఒక్కరును మెలకువగలిగియున్న యట్లు తోమిఁ జింతించి యిదియే మన్యాయమని తలంచెను. పరికించి చూడఁగాఁ బూజామందిరము తలుపు తెఱచియున్న ట్లగపడెను. ఏదో కృత్రిమము సాగినదని చింతించి సేవకులంబంపి తనమిత్రుని భార్యతోడ రప్పించెను

ఆ దంపతులను మూలికాపద్దతులు క్షుద్ర విద్యావి శేషములు తెలియును. కావున నితరుల దుష్టకృ త్యములు వారిని బాధింపజాలవు. ఆవిషయ మెఱింగియే కాహళుడు వారిని బిలిపించెను. దీపమునఁ బిండినపసరు దీప కాంతి వ్యాపించి నంతదూరము తనశక్తిఁ జూపఁజాలక కుడ్యముదనుకఁ జూపఁ గలదని యొక నియమమఁట. ఆవిషయము లెల్ల నాదంపతు లెఱుంగుదురు. కావుననే కాహళుని చెంతకు వచ్చిన యతని మిత్రుడు భార్యను లోపలికిం బోయి కనుఁగొనుమని యాజ్ఞా