పుట:నీతి రత్నాకరము.pdf/71

ఈ పుట ఆమోదించబడ్డది

68

నీతిరత్నాకరము

వేంకటేశ్వరుఁ డిఁ'కేమి చేయవలయునో తెల్పుఁడని తక్కిన వారి నడిగెను. గురువు నానతి మైఁ జేయవలయునని తక్కినవారు తెలిపిరి. అర్చకులంగాంచి మీరు ప్రాణముల దక్కించుకొన దలంచినచో నెన్వ రెవ్వరు వచ్చినది. తెలుపుఁడని యడిగిన వేంకటేశ్వరుం గాంచి వడంకుచు గోపురమునకు వెలుపల నేడుగురు వ్యాధు లున్న వారనియు వా రాశౌచభయమున లోనికి రారై రనియుఁ దెల్పిరి. మీ రిపుడు మేము చెప్పునట్లు చేయకయున్న నంబకు బలియిత్తునని యాతఁడు మరలఁ బలికెను. మీ రాజ్ఞ యిచ్చినట్లే చేయుదుమని వారు ప్రమాణము చేసిరి తక్కిన వారితో నాలోచించి వేంకటేశ్వరుఁ డిట్లు పలికెను. మాశ్యామ సుందరుఁడు మీతోడ వచ్చును. గ్రామమున కొక్కఁడే పోవలయును, ఒక్కఁ డిక్కడనే యుండవలయును. ఇరువురు మనుష్యు లను బిలుచుకొని త్వరగా నగరమునకుం బోయి రాధి కాకుశల వార్తఁ దల్లిలోనగువారికిం దెలిపి రావలయు. వా రరుదెంతురు గాన మీరు రేపు రావచ్చును. మాశ్యామసుందరుఁడు నగరము నకు మీతోడనే వచ్చును. మీ రట్లు చేసిన మాకృపకుఁ బాత్రు లగుదురు. లేనిచో నీనిస్త్రింశమునకు బలియగుదురు. అనఁగా వారట్టులే యొనరింతుమని బాసచేసిరి. నృసింహస్వామ్యర్చకుఁడు శ్యామసుందరుంగూడి భరతపురమునకుం బోయి పెద్దలతో రహస్యముగా నా తెఱఁ గెఱింగించి వారియనుమతిచే వచ్చిన మనుష్యులంగూడి కాఁగడలం గొని విలాస థామమునకు బయనము చేసెను.