పుట:నీతి రత్నాకరము.pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

67

గాళీచరణదాసు గోపురద్వారముల మూసివచ్చెను. ఇంక నెవ్వరును రాఁజాలరు. వారెంతయో రాధిక నోదార్చిరి. పాతాళునిం జూపిరి కుంతలు నల్లే బంధించిరి, అర్చకులిరువురు పాదాక్రాంతు లైరి. వారిని గట్టివేయక కదలకయుండుఁడని హెచ్చరించిరి. వారు శవములవలె నుండిరి. ఈనల్వురేపుడువచ్చి యందుండిరో యేఱుంగుట కష్టము. ఆవిషయము తెలిసికొనవలసినదే.

ఆనాఁడు సాయంకాలమున నల్వురును వేషాంతరముల దేవాలయముకడనుండు వృక్షములకడ నుండిరి దాని ప్రక్కనే యొకమార్గము కలదు అదియే విలాస ధామమునకుం బోవు పెద్ద బాట ఎందఱో పోవుచు వచ్చుచుందురు. అర్చకు లిరువురు సాయంకాలమే మహాద్వారము తెఱచి లోనఁ బ్రవేశించిరి. వారందే వంట చేయవలసిన ట్లాచారము కలదు. వంటచేయుచు నడుమనడుమ దేవతల కలంకారముఁగూర్చుచు మరల మహానస గృహమునకు బోవుచు వచ్చుచుండుట యలవాటు. ఆరీతిగా నాఁడును సాగుచుండఁగా నిరువురు కాళికాదేవి వెనుక భాగమునఁ జేరిరి. తక్కినయిర్వురు మండపములు ప్రక్కలనున్నందున వానీ చెంతనుండు వృక్షముల నెక్కి యాకుజొంపములఁ గూరుచుండి యుండిరి. ఆనాఁడు గాఢాంధకారము మేఘ మావరించుటం జేసి కలిగెను. వారుకని పెట్టియుండి పాతాళుఁడు కత్తిఁ ద్రిప్పుచువచ్చి కంఠము తెగ వ్రేయునని యూహించి యొక్క సారి వచ్చిరి. రాధికను గాపాడిరి. వీరిని బంధించిరి.