పుట:నీతి రత్నాకరము.pdf/69

ఈ పుట ఆమోదించబడ్డది

66

నీతిరత్నాకరము

భాగమునుండి యొక్కయెత్తున దుమి కెను. తళతళలాడు కర వాలములు వాని రెండు చేతుల మెఱయుచుండెను. అతని వెంటఁ గాళీ చరణదాసుఁడు బలిష్ఠమగుదేహము కనంబడ ఖడ్గపాణియై వచ్చెను. రామకిశోరశర్మయు శ్యామసుందరుఁడు నుద్దండ ధ్వనుల నంబకమును బగులఁ జేయుచుఁ ద్రాళ్ళు పట్టుకొని యాయుధపాణులై దక్షిణోత్తరభాగములనుండి చివాలున నట వ్రాలిరి. ఎత్తినకత్తి నట్లే తునుక లై పడఁ గాళీచరణదాసు తన ఖడ్గమునఁ గొట్టెను. వేంకటేశ్వరుఁ డొక్కెతునఁ బయింబడి సిగపట్టుకొని వంచి జానుఘాతముల మర్దించెను. రామకిశోర శర్మ వాని నా తాళ్లచే బంధించెను. పాప మాపాతాళుఁడు దిగ్బ్రమము చెంది యూరకయుండెను. అర్చకులిరువురు ప్రాణములపై నాశమాని యట్లే కూలబడిరి. కుంతలుఁడు స్మృతిదప్పి ముందే పడిపోయెను. వ్యాధులిర్వురు వారిం గాంచి యేమో యనఁబోవునంతలో రామకిశోరశర్మయు శ్యామసుందరుఁడును జక్కగా మర్ధించి కట్టివై చిరి. నోటి నుండి మాటవెడలినఁ దల లేగిరిపోవు ననిరి వారేనాఁడో చచ్చినట్లూరకుండిరి.

వేంకటేశ్వరుఁడు సోదరీ! రాధికా ! భయంపడకుము. వీఁడె పాతాళుఁడు బంధింపఁబడియె. మే మనం తాచలశర్మ శిష్యులము. నీదురవస్థ ముందే తెలిసికొని నచ్చితిమి. భయం పడక లెమ్మనిరి. పాపమా రాధిక ప్రాణము లెందుండెనో యప్పుడు మరల దేహమునఁ బ్రవేశించెను. కన్నులు స్వాధీనము లయ్యెను. చూడఁగాఁ దమయింటి కపుడపుడు వచ్చుచున్న వారే యని స్మృతికిం దగిలిరి. ఆనలువురం గాంచినంతనే యామె దుఃఖ మాపుకొనలేక బోరున నేడువసాగెను. ఇంతలోఁ