పుట:నీతి రత్నాకరము.pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

నాల్గవ వీచీక. యించెను. వ్యాధులిద్దఱు బదులాడక దూరముగాఁ గూరు చుండి యుండిరి. కొంత సేపిట్లు గొణిగి గొణిగి రాధికా ! ఇది కడ సారిమాట. ఏమందువు? అని యదలించెను. ఖడ్గమును జళి పించెను. ఔడుగఱచి కత్తినాడించిను. అది కుక్కనాలుకవలె నల్లల నాడుచుండెను. ఒక్క వేటున కెందఱికంఠములనైన దునుమఁగల ధార దానికిం గలదనుట నిక్కము. రాధిక పలుకలేదు. తల్లిదండ్రులం దలంచుకొని యిఁ కేటి జనకులని వదలి భగవతి ధ్యానించి యెట్టి కష్టములనైనఁ దొలఁగింతువని నమ్మి తిని. నీదయ అని వినుతించుచుండెను. అంతఁ బాతాళుడు కరవాలాగ్రమును రాధికా కంఠమునకుఁ దగులఁ జేసి యిదె మఱియొకసారి హెచ్చరించుచున్న వాఁడ. ఏమందువు? నన్ను వరింతువా. ఖడ్గ ధారకు బలియగుదువా యని బెదరించెను, బదులు లేదు. మూడుసారులు కత్తిని దనచుట్టును ద్రి ప్పెను, కాళికా! ఇవె కన్యాకంఠ రక్తధారలు. తనివిదీఱఁ గ్రోలుమా యని కత్తి మరల జళిపించెను. వానిమోము చూడఁ దరము గాక యుండెను. అర్చకు లీరువు రుత్తరీయముల నడుములకు బిగించి నిలువఁబడిరి కుంతలుఁడు దర్శగ్రంధి యవలఁ బాఱవైచి చేతికఱ్ఱనూని నిలుచుండెను. కత్తియెత్తగనే నే యడ్డుపడవలయు నని యాతనియూహ. పాతాళుఁ డంబకు నమస్కరించి సెలవా జననీ ! యని యడిగెను.

ఇంక సెలవే లెమ్ము. పాతాళా క్రూరనూనసా ! సెలవే. అను కరాళాట్టహాసయుత వాక్కు లెందుండి యో వినఁబడియెను. అర్చకులు కుంతలుఁడు నులికిపడి నలుదిక్కులకు దృష్టులఁ బ్రసరింపసాగిరి. అంతలో వేంక టేశ్వరుఁడు దేవి వ్రష్ఠ