పుట:నీతి రత్నాకరము.pdf/65

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

64

ఇఁక నన్ను మాటలాడింపకుము. నీయిచ్చవచ్చిన చొప్పునం జేయుము. అని ధ్యానము నాశ్రయించి నిమీలితనేత్రయై, పరదేవీపాదారవిందములం దలంచుచుండెను.

పాతాళుఁ డాపలుకులకు నాగ్రహించెను. నాచేతం జిక్కి యుఁ 'గాఱులాడెదవా యని యదలించెను. నీకంఠముంద్రెంచి రక్తధారల నంబాపాదారవిందములఁ బ్రక్షాళన మొనరింతును. రవంత సేపు తాళుమని భయపెట్టెను. ఏమో జపించినట్లు నటించెను. కాళికాసమీపమునకుం బోయి సాష్టాంగ నమస్కారముల నాచరించెను. లేచి కరములముకుళించి భగవతిని వినుతించెను. ఖడ్గము నా మెపదనఖరములకుం దగిలించి యందు కొని జళిపించెను. జననీ! కన్యకారత్న కంఠ లుంఠన మొసరించి వేఁడి నెత్తురు సోనల నీకర్పించి కృతకృత్యుండ నయ్యెద. నాకర వాలముచివరన నిలిచియుండుమా యని యభ్యర్థించెను. ఒక్క దాఁటున వచ్చి రాధికా కాంత మ్రోల నిలువంబడియెను, విశేషించి యామెను బలుకరింపక యేమోగొణుగుకొనుచుండెను. అర్చకుల కిరువురకుఁ బాదములు మొదలుకొని యుత్తమాంగముపఱకు వడఁకసాగెను, ఏమో యుపద్రవము రానున్నది. మన మేల యీ పెంటలో దిగితిమిరా స్వామియని చింతింపసాగిరి. కరవాలమున కాహుతి కానీయక మన మాపవలయునని యూహించిరి. కాని యాతని భీషణాకారమును గాంచి మనకే యాపని యగునేమో యని యనుమానింపసాగిరి. కుంతలుఁడు వడఁకుచు నేనేల యీక్రూరుని మాటలవింటినని పలుభంగుల విచారించ సాగాను. ఏది యేమైనను గన్యకప్రాణముల దక్కింపవలయునని నిశ్చ