పుట:నీతి రత్నాకరము.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

63

యిచ్చి యాదేవీకరుణకుం బాత్రుడనై యాముష్మి కసుఖము లొందుటొండె. ఈ రెండు పనులలో నొక్కటి కావలయును. ఏమనియెదవు ! నీయిష్టానుసారము 'మెలంగువాఁడను గాను, ఇదిగో మంగళసూత్రము. ఇదిగో నిశిత ధారాకరాళమగు కరవాలము. ఈ రెండింటిలో దేనిం గోరుదువు? త్వరగాఁ దెలుపుమని యదలించెను. కుంతలాదు లాకరవాల ధారం గాంచి గడగడ వడంకిరి.

రాధిక నయనములు తెఱచి భగవతికి నమస్కరించి ధర్మమును నమ్మి భయముం బాఱఁద్రోలి యిఁక జీవితాశంగొని లాభము లేదని నిశ్చయించుకొని గంభీరో క్తుల నిట్లు పలికెను. పాతాళా ! ఈ మానవజన్మము పెక్కు పుణ్యములకుఁ బ్రతి ఫలము. దీనిని మరలఁ 'బాపభూయిష్ట ముగఁ జేయరాదు. మానన హృదయము పవిత్ర మైనది. దీని నపవిత్రముగాఁ జేయరాదు. అది మానవస్వభావమునకు విరుద్దము. ఈతనువు గూడ స్థిరముగా నిలుచునది కాదు. నరహింసాదులు పౌరుషములు గావు. అవి నీచతమములు. ఈయోషధులు నీమంత్రములు నిన్నుద్ధరింపఁ జాలవు సరికదా, నీచాతి నీచగతికిం దీసికొనిపోవఁ గలవు. ఇది సత్యము. ఈ కాళికాదేవి నా యిలువేలుపంటివి. ఈయొక్క మాటయే నీయజ్ఞానమును వెల్లడించుచున్నది. సకలలోకజనని కదా యీ పరదేవి. నీయిలువేల్పు మాత్ర మెట్లగును? జగజ్జన నికి నన్నా హారమిచ్చిన నా దేవి యీపుత్త్రికను బరి గ్రహించునా? ఈ కార్యమున సంతోషించునా? నీచుఁడా! ఏలయందని మ్రాఁకుల కఱ్ఱుచాపెదవు? ఈకన్యక నీకు లభించునది కాదు. కరవాలమున కాహుతియే చేయుము. భగవతిసాన్నిధ్యముననే యుండెద.